కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలకు భారీ ఎత్తున బాధ్యతలు ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావడం ఒక ఎత్తయితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పార్టీ సీనియర్లను తిరిగి పార్టికి సానుకూలంగా మార్చాల్సి న అవసరం ఉంది. దీంతో పాటు.. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి కడప పైనా షర్మిల ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ.. వారంతా తమ తమ మార్గాల్లో వేర్వేరుగా ఉంటున్నారు. కొందరు ఇతర పార్టీల్లో యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకీ కాకుండా.. ఉన్నవారు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే..వీరిని పార్టీవైపు మళ్లించే బాధ్యత షర్మి లపైనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వైఎస్ కంచుకోట వంటి కడప జిల్లాలో ఆమె ఎలా వ్యవహరిస్తారు? కీలక నేతలను పార్టీకి అనుకూలంగా ఎలా మారుస్తారు? అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ అభిమానులే కాకుండా.. కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కువగా నే ఉన్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి వంటి వారితోపాటు.. ప్రస్తుతం టీడీపీలోను, వైసీపీలోనూ ఉన్న నాయకులు ఉన్నారు. వీరంతా కూడా వైఎస్‌కే కాకుండా.. కాంగ్రెస్‌కు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని కాంగ్రెస్ వైపు తీసుకురావాల్సిన అవసరం షర్మిలపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆమె ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారనేద కీలకం.
ఇక, మరోముఖ్య విషయం.. కడపలో ఓటు బ్యాంకు. ఒకప్పుడు నాయకులతో సంబంధం లేకుండా.. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సమష్టి ఓటు బ్యాంకు ఉండేది. నాయకులు ఎవరైనా సరే.. పార్టీ పరంగా దూకుడు ప్రదర్శించినా.. అంతమంగా ప్రజలు పార్టీనే చూసేవారు. వ్యక్తిగతం కంటే పార్టీ కి ప్లస్‌గా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దఖలు పడింది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకును ఎలా తనవైపు తిప్పుకుంటారనేది షర్మిల వ్యూహానికి పదునైన పరీక్షగానే మారుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 22, 2024 10:22 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…