ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిలకు.. కొత్త చేరికల ప్రారంభం బూస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోం ది. అందరూ ఊహించినట్టుగానే మంగళగిరి ఎమ్మెల్యే, ఇటీవల వైసీపీకి రాజీనామ చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌లో చేరిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో షర్మిల బాద్యతలు చేపట్టిన వెంటనే ఆళ్ల రామకృ ష్ణారెడ్డి కూడా అక్కడకు చేరుకుని ఆమె ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా ఆళ్ల మాట్లడుతూ.. తాను ముందుగానే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తన అనుచరులు కూడా త్వరలోనే పార్టీలో చేరనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పరిణామంతో షర్మిలకు కొంత సంతోషం, అదేసమయంలో మరింత మంది చేరనున్నారన్న భావన వ్యక్తం చేశారు. తన పోరాటం వైసీపీపైనేనని షర్మిల స్పష్టం చేశారు. అయితే.. తను పోరాటం చేస్తోంది మాత్రం పాలనా పరంగా వైసీపీ ప్రభుత్వంపైనేనని, తన సోదరుడిపై కాదని ఆమె స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 60 నుంచి 70 సీట్లు వచ్చేలా అసెంబ్లీలో కాంగ్రెస్ ఉండేలా తన చర్యలు ఉంటాయని షర్మిల చెప్పారు. పార్టీలో ఉండి పదవులు అనుభవించిన వారు వెంటనే పార్టీలోకి చేరి బలోపేతం చేస్తారని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వసతులు.. సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని, వీటిని కూడా తాము ప్రధానంగా చర్చిస్తామన్నారు. తాను త్వరలోనే జిల్లాల పర్యటనలు చేయనున్నట్టు షర్మిల వెల్లడించారు.
కాగా, మంగళగిరి నుంచి గత రెండు ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాజాగా ఈ సీటును టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి పార్టీ కేటాయించడంతో ఆయన విభేదించి.. బయటకు వచ్చారు. ఈ క్రమంలో అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని, అందుకే తాను బయటకు వచ్చానన్న ఆయన.. షర్మిల వెనుక నడుస్తానని చెప్పారు. అనుకున్నట్టుగా నే ఆయన షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న వెంటనే ఆమె వెంట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
This post was last modified on January 21, 2024 10:07 pm
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…