ఏపీలో మరికొన్ని వారాల్లోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రాజకీయ పార్టీలు తమతమ వ్యూహాలకు పదును పెట్టాయి. నాయకులకు టికెట్లను కూడా ఖరారు చేస్తున్నాయి. అయితే.. ఓటు బ్యాంకు పరంగా.. ఓట్లు వేసే విషయాన్ని పరిశీలిస్తే.. ఖచ్చితంగా ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకు ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రాంతాల వారిగా.. ప్రజల మైండ్‌సెట్ కూడా మారిందని అంటున్నారు.
ఉదాహరణకు పట్టణ ఓటరు.. కొంత మేరకు తటస్థంగా ఉంటాడు. తనకు పనులు చేసిన పెడితే.. ఆ పార్టీ ప్రభుత్వం మంచిదని చెబుతాడు. లేకపోతే.. విమర్శలు గుప్పిస్తారు. పోనీ.. ప్రభుత్వ పార్టీ విషయంలో సానుకూలంగా మాట్లాడినా పోలింగ్ బూత్ వరకు వస్తారనే నమ్మకం మాత్రం చాలా తక్కువ. ఇక, నగర ఓటరు విషయాన్ని పరిశీలిస్తే.. ఇక్కడే పార్టీలు పంపకాలకు తెరదీస్తున్నాయి. తటస్థంగా ఉంటూనే.. పార్టీల తలరాతను మార్చే ఓటు బ్యాంకు మెజారిటీగా నగరాల్లోనే ఉంటుంది.
ఇక, గ్రామీణ వాతావరణం పరిశీలిస్తే.. ఇటీవల కాలంలోనే కాదు.. ఎప్పటి నుంచో కూడా. గ్రామీణ ఓటు బ్యాంకు పుంజుకుంది. పార్టీల నమ్మకం కూడా ఈగ్రామీణ ఓటు బ్యాంకుపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటు బ్యాంకును కదలకుండా చూసుకునేందుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ప్రస్తుతం కూడా ఇదే విధానాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ ఇప్పుడు విలేజ్ పాలిటిక్స్ సెగపెడుతున్నాయి.
అభివృద్ధి, పథకాలు.. అనే విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ వంటివి తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సి న నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడేసుకుంటున్న తీరును సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. దీంతో గ్రామీణ వ్యవస్థలో వైసీపీకి సెగ పెరిగిందనేది వాస్తవం.
ఇటీవల ఓ సర్పంచు హరిదాసు వేషం వేసి.. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన విధానం.. నిధులు ఇవ్వని వైనాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటు బ్యాంకు వైసీపీకి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక, టీడీపీ పరిస్థితిని గమనిస్తే.. ఒకింత పాజిటివ్ ఫీడ్ బ్యాకే అందుతోంది. వ్యక్తిగతంగా టీడీపీ పథకాల పట్ల ప్రజల నుంచి సానుకూల ధోరణి వినిపిస్తోంది.
This post was last modified on January 21, 2024 7:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…