సమీక్షలు జరిగేకొద్దీ ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడి బయటపడుతోందా ? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా బయటపడుతున్న దోపిడీని చూసి మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఉన్నతాదికారులు చెప్పిన సమాధానాలు విని మంత్రులు ఆశ్చర్యపోయారు.
జిల్లాలోని రెండు ప్రాజెక్టల్లోనే కేసీయార్ హయాంలో రు. 20 వేల కోట్ల దోపిడి జరిగిందని మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు రు. 9 వేల కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరంకు కూడా ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇరిగేషన్లో ప్రాజెక్టుల కోసం కేసీయార్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే రు. 18 వేలు కట్టాలని చెప్పారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీ జరిగిందన్నారు.
దోపిడీ చేయటానికే కేసీయార్ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టినట్లుందని అనుమానం కూడా వ్యక్తంచేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రు. 86 వేల కోట్లలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు మంత్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాసిరకం నాణ్యత బయటపడింది. రు. 1681 కోట్లతో పూర్తయిపోయే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో కేసీయార్ ప్రభుత్వం రు.18,500 కోట్లకు పెంచినట్లు మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని ప్రభుత్వం హైకోర్టు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాసింది. తాజా పరిణామాల్లో సిట్టింగ్ జడ్జి విచారణను కాళేశ్వరంకు మాత్రమే పరిమితం చేస్తుందా లేకపోతే హోలు మొత్తంమీద ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ వర్తింపచేస్తుందా అన్నది అర్ధంకావటంలేదు.
This post was last modified on January 21, 2024 12:59 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…