పార్లమెంటు ఎన్నికల్లోపు కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఖాళీ చేయటం కూడా పై నుండి కాకుండా గ్రౌండ్ లెవల్ నుండి మొదలుపెట్టింది. అందుకనే ముందుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్ లపై దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ ను క్షేత్రస్ధాయిలో దెబ్బకొడితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతీయటం సులభమని కాంగ్రెస్ ముఖ్యులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకనే వీలైనన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను పెడుతున్నది.
బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీలను వీలైనంత తొందరలో తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్లు సిద్ధం చేశారు. ఇప్పటికి సుమారు 10 మున్సిపల్ ఛైర్మన్లను అవిశ్వాసం ద్వారా దింపేశారు. ఈ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ముందుగా కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకుని ఆ తర్వాత సంఖ్యాబలం ఆధారంగా ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నది. పెరిగిన సంఖ్యాబలం కారణంగా ఛైర్మన్లను దింపేస్తున్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఈపని చేస్తుందని ఊహించిందే.
ఎందుకంటే గడచిన పదేళ్ళల్లో బీఆర్ఎస్ చేసింది కూడా ఇదే కాబట్టి. అసలు క్షేత్రస్ధాయిలో బలమేలేని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలందరినీ టార్గెట్ చేసి మరీ లాగేసుకున్నది. కాంగ్రెస్, టీడీపీల నుండి లాక్కున్న బలాన్నే తమ బలంగా చేసుకున్నది. కాబట్టి ఇపుడు అదే పద్దతిని కాంగ్రెస్ కూడా అనుసరిస్తున్నది. అందుకనే కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరూ నోరెత్తలేకపోతున్నారు. ఇదే పద్దతిలో పంచాయితీలను కూడా లాగేసుకునేందుకు ప్లాన్లు సిద్ధమయ్యాయట. కాబట్టి తొందరలోనే జిల్లా పరిషత్తులు కూడా బీఆర్ఎస్ చేజారిపోవటం ఖాయం.
ముందుగా గ్రౌండ్ లెవల్లో బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బకొట్టిన తర్వాత ఎంఎల్సీలు, ఆ తర్వాత ఎంఎల్ఏలపైన గురిపెట్టాలని డిసైడ్ అయ్యారట హస్తం నేతలు. బీఆర్ఎస్ ఏ విధంగా అయితే బలోపేతమైందని అనుకున్నదో అదే పద్దతిలో పూర్తిగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేలోగా ఎంతవీలైతే అంత దెబ్బకొట్టి తర్వాత మిగిలిన పనిని ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే అజెండాను సెట్ చేసుకున్నట్లు సమాచారం.
This post was last modified on January 21, 2024 12:57 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…