ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల నాటి కల. ఇప్పుడు సాకారం అవుతున్న వేళ.. యావత్ దేశం ఒకలాంటి భావోద్వేగంతో నిండి ఉంది. అయోధ్యలో రామాలయ స్వప్నం తీరటం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకువీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే.
మరికొద్ది గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తో సహా అతిరధ మహారథులు ఎందరో ఈ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకోవటానికి పెద్ద ఎత్తున భక్తజనం అయోధ్యకు వెళ్లేందుకు రెఢీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జనవరి 22న (సోమవారం) ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున అయోధ్యకు ఆహ్వానం అందుకున్న వారికి మాత్రమే అనుమతించే విషయాన్ని స్పష్టం చేయటం తెలిసిందే. టూరిజం భారీగా పెరగనున్న వేళ.. అయోధ్యలో హోటల్ రూం గదుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
పలు స్టార్ హోటళ్లలో రోజుకు రూ.లక్ష ఛార్జ్ చేసే వరకు ధరలు వెళ్లాయి. గతంతో పోలిస్తే ఈ నెల 20-25 మధ్యన హోటల్ అద్దెలు ఐదు రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. పార్క్ ఇన్ రాడిసన్ హోటల్ టాప్ రూం ధర రూ.లక్ష మార్క్ దాటినట్లుగా చెబుతున్నారు. పార్క్ ఇన్ హోటల్ లోనూ ఇదే పరిస్థితని చెబుతున్నారు. అయోధ్యలో హోటల్ గదులు పూర్తిగా బుక్ అయ్యాయని.. దీంతో అయోధ్యకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటళ్లకు సైతం గిరాకీ భారీగా పెరిగిపోయింది.
పలువురు హోం స్టేల వైపు చూస్తున్నారు. రామమందిరం ప్రారంభమైన తర్వాత హోటల్ గదుల ధరలు రూ.7వేల నుంచి రూ.25వేలకు పెరిగినట్లుగా చెబుతున్నారు. డిమాండ్ భారీగా ఉండటంతో హోం స్టేలు సైతం అందుబాటులోకి వచ్చినట్ుల చెబుతున్నారు. వీటిల్లో మాత్రం రూం ధరలు రూ.4వేలకే మంచి డీల్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 21, 2024 12:23 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…