ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి (ప్రస్తుతం కోనసీమ జిల్లా) చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా ప్రకటించారు. తనతోపాటు.. 20 నుంచి 30 వేల మంది శెట్టిబలిజ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు. వాస్తవానికి శెట్టిబలిజ సామాజిక వర్గం కోనసీమలో బలమైన పాత్ర పోషిస్తోంది.
దాదాపు 40 వేల నుంచి 50 వేల మధ్య ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో ఒక తెగగా ఉన్నారు. ఇక, వాసంశెట్టి సుభాష్.. శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజిక వర్గం ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే.. జిల్లా పేరు మార్పు నుంచి(కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ) ఆయన పార్టీతో విభేదిస్తున్నారు.
అంతేకాదు.. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన భారీ ఆందోళనలు, నిరసనల్లో ఈ సామాజిక వర్గం పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం ఆయా కేసులను ఎత్తివేసింది. అయినప్పటికీ.. స్థానికంగా ఉన్న రాజకీయ నేతలు.. తమతో కలివిడిగా ఉండడం లేదని.. కులాలమధ్య చిచ్చు పెడుతున్నారని.. దీనిని నివారించేందుకు అలాంటి నాయకులకు టికెట్ ఇవ్వరాదని.. కొన్నాళ్లుగా వాసంశెట్టి డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డికి వివరించారు. అయినా.. ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్‌ను పట్టించుకోలేదన్నది వాసంశెట్టి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇక, పార్టీలో ఇమడలేక.. బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎఫెక్ట్‌తో సుమారు 40 వేల నుంచి 50 వేల శెట్టిబలిజ ఓట్లు వైసీపీకి దూరమవుతాయనే అంచనా ఉంది. వీరంతా ఒకే మాటపై ఉంటారని తెలిసిందే. త్వరలోనే వాసంశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు.
This post was last modified on January 20, 2024 8:24 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…