ఎప్పుడూ గంభీరంగా కనిపించే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే.. కన్నీళ్లను ఆపుకుని.. గద్గద స్వరంతో ఆయన ప్రసంగించారు. దీనికి కారణం.. చిన్ననాటి సంగతులు.. తమ కుటుంబం కష్టాలు ఆయన కళ్లముందు కదలాడడమే. గుర్తుకు రావడమే. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. దేశంలోనే అతి పెద్ద సొసైటీగా నిర్మించిన భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వసతులతో నిర్మించిన ఈ భవనాలు.. దేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో తొలిస్థానంలో ఉన్నాయి. వీటిని ప్రారంభిం చిన అనంతరం.. మోడీ ప్రసంగిస్తూ… మీరు ఇప్పుడు అదృష్టవంతులు. అన్ని వసతులు.. సౌకర్యాలు, అధునాతన నిర్మాణాలతో కూడిన ఇళ్లను సొంతం చేసుకున్నారు
అని వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. “నా చిన్నప్పుడు ఇలాంటి ఇళ్లలో ఉండే అవకాశం మాకు రాలేదు. చిన్న ఇంట్లోనే అందరం కాళ్లు ముడుచుకుని ఉండే వాళ్లం.. ” అంటూ.. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి.. కొన్ని సెకన్లపాటు తన ప్రసంగాన్ని ఆపేశారు. అనంతరం తేరుకున్నా.. మోడీ గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది. గద్గద స్వరంతోనే ఆయన మాట్లాడారు. నేడు తమ ప్రభుత్వం పేదలకు అధునాతన ఇళ్లను నిర్మించి ఇస్తోందని చెప్పారు.
పేదలకు మేలు చేయాలన్న సంకల్పంతో అయోధ్య రాముడిని ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోడీ చెప్పారు. ఈ నెల 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్టా కార్యక్రమాన్నిపురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు.
This post was last modified on January 19, 2024 5:17 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…