Political News

తెలంగాణ బీజేపీలో భారీ ట్విస్టులు

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్ర మోర్చాలతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను మార్చేసింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన ఆరు మోర్చాలను కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మార్చేశారు. ఇపుడు మార్చిన వాళ్ళంతా చాలా కాలంగా పదవుల్లో ఉన్న వాళ్ళే. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నపుడు కిషన్ వీళ్ళని మార్చటంపై దృష్టిపెట్టలేదు.

ఎందుకంటే కిషన్ అధ్యక్షుడు అయ్యిందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కాబట్టి మిగిలిన వాళ్ళని మార్చే ఆలోచన చేయలేదు. ఇపుడు కిషన్ కుదురుకున్న కారణంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మార్పులు మొదలుపెట్టారు. ముందుగా ఎస్టీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్ నాయక్ ను, ఎస్సీ మోర్చాకు మాజీ ఎంఎల్ఏ కొండేటి శ్రీధర్, యువ మోర్చాకు సేవెల్ల మహేందర్, ఓబీసీ మోర్చాకు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చాకు డాక్టర్ శిల్పను కిషన్ రెడ్డి నియిమించారు.

అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కులాచారి దినేష్ కుమార్, పెద్దపల్లికి చందుపట్ల సునీల్, సంగారెడ్డికి గోదావరి, సిద్ధిపేటకు గంగడి మోహన్ రెడ్డి, యాదాద్రి, భువనగిరికి పాశం భాస్కర్, వనపర్తికి డీ నారాయణ, వికారాబాద్ కు మాధవరెడ్డి, నల్లగొండకు డాక్టర్ వర్షిత్ రెడ్డి, ములుగుకు బలరాం, మహబూబ్ నగర్ జిల్లాకు పీ శ్రీనివాసరెడ్డి, వరంగల్ కు గంటరవి, నారాయణపేట జిల్లాకు జలంధర్ రెడ్డిని కిషన్ నియమించారు.

బహుశా వీళ్ళంతా కొత్తవాళ్ళు కాబట్టి అందరు కిషన్ టీముగా చెలామణి అవుతారేమో. కొత్తవారికి అవకాశం ఇవ్వటం వల్ల అందరు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కష్టపడి పనిచేస్తారని కిషన్ అనుకున్నట్లున్నారు. జిల్లాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు ఎంత కష్టపడినా అభ్యర్ధులు గట్టివారయ్యుండాలని కిషన్ మరచిపోయినట్లున్నారు. అలాగే జనాల్లో పార్టీకి సానుకూలత ఉంటేనే అభ్యర్దులు గెలుస్తారని కిషన్ మరచిపోయారు. మరి కొత్త్ మోర్చా అధ్యక్షులు, జల్లాల అధ్యక్షులు ఏమేరకు కష్టపడతారో, ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

This post was last modified on January 19, 2024 2:57 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago