ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాయపాటి సాంబశివరావు.. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్ లో చక్రం తిప్పారు. అయితే.. టీడీపీకి కూడా ఆయన సానుకూలంగా ఉన్నారనే చర్చ ఉంది. విభేదించేవారు కాదు. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ నేత అయిన.. కన్నా లక్ష్మీనారాయణతోనే వైరం ఉండేది తప్ప.. టీడీపీ నాయకులతో ఆయన ఎక్కడా విభేదించిన సందర్భాలు లేవు.
పైగా.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే.. రాయపాటి.. టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారని అంటారు. ఈ క్రమంలోనే 2014 రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడంతో ఆయన వెంటనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీచేసి విజయం దక్కించుకున్నారు. 2019లో రాయపాటి ఓడిపోతారని తెలిసి కూడా.. ఆయనపై ఉన్న అభిమానంతో చంద్రబాబు.. టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక మంది పోటీకి రెడీ అయినా.. పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడు ఇదే కుటుంబం చంద్రబాబు కేంద్రంగా రాజకీయ విమర్శలు చేస్తూ.. రచ్చకు దిగడం.. అందరినీ విస్మయానికి గురి చేసింది. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్‌ను రాయపాటి కుమారుడు రంగారావు ఆశించారన్నది నిజం. కానీ, ఇది దక్కలేదు. దీంతో ఈ కుటుంబం టీడీపీకి దూరమై.. వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రంగారావు బయటకు వచ్చి.. చంద్రబాబు, నారా లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో టీడీపీని సమర్థించిన రాయపాటి సోదరుడి కుమార్తె, అమరావతి జేఏసీ నాయకురాలు.. రాయపాటి శైలజపైనా అక్కసు వెళ్లగక్కారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా.. టీడీపీకి వచ్చే నష్టం కన్నా.. రాయపాటి కుటుంబంపై ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న మంచి పేరు, ఇమేజ్ వంటి ఖరాబ్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాయపాటి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా.. జిల్లాలో టీడీపీ వెలిగిందని.. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ టీడీపీ ఉందన్నట్టుగా వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 18, 2024 5:05 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…