Political News

తారక్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య హుకుం!

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చంద్రబాబు బాలకృష్ణ తదితరులు అన్నగారికి నివాళులర్పించారు. అయితే, అంతకుముందు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలుకుతూ అక్కడ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులు భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ చెప్పడం సంచలనం రేపుతోంది‌. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తీసివేయాలని బాలకృష్ణ తన అనుచరులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టు సమయంలో, అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కూడా తారక్, కళ్యాణ్ రామ్ లు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే నందమూరి, నారా కుటుంబాలతో ఆ ఇద్దరికి చాలాకాలంగా గ్యాప్ వచ్చిందని టాక్ నడుస్తోంది.

అందుకే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే తీయించేయ్… అంటూ ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని బాలకృష్ణ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. బాలకృష్ణ చెప్పిన వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను బాలయ్య బాబు అనుచరులు తొలగించారు. యమదొంగ చిత్రంలో యమధర్మరాజు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోతో పాటు, అన్న నందమూరి తారక రామారావు ఫొటోను కలిపి ఫ్లెక్సీలు అభిమానులు వేయించారు. వాటిని తొలగిస్తున్న వీడియో వ్యవహారంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందన ఏవిధంగా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 18, 2024 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

38 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

1 hour ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

2 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

10 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago