ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ తనయ.. షర్మిల పగ్గాలు చేపట్టనున్నారు. త్వరలోనే ఆమె అధికారికంగా బాధ్యత లు తీసుకుంటారు. రాజకీయాలను పక్కన పెడితే.. ఈ బాధ్యతలు తీసుకున్నందున కాంగ్రెస్ పార్టీ ఆమెకు చేకూర్చే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. జాతీయ పార్టీలైన.. కాంగ్రెస్, బీజేపీలే కాదు.. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, ఆమ్ ఆద్మీపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా.. వారి వారి నాయకులకు పదవులను బట్టి వేతనాలు ఇస్తుంటాయి.
ఉన్న అన్ని పార్టీల్లోనూ కాంగ్రెస్‌లోనే నేతలకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే బీజేపీ కూడా.. జాతీయ స్థాయిలో వేతనాలు సవరించి.. కాంగ్రెస్‌కు సమానంగా వారి నాయకులకు ఇస్తోంది. ఇక, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారికి.. ఆ పార్టీ ఇస్తున్న వేతన నెలకు రూ.2 లక్షలు. ఇది కేవలం వేతనం మాత్రమే. ఇతర సౌకర్యాలు మళ్లీ అదనంగా ఉంటాయి. రెండు కార్లు కేటాయిస్తారు. నలుగురు డ్రైవర్లు ఉంటారు.
అంతేకాదు.. పీసీసీ చీఫ్ హోదాలో దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా.. విమాన ఖర్చులు, బస.. భోజనం.. ఒక పీఏ ఖర్చును కూడా పార్టీనే ఇస్తుంది. వీటితోపాటు.. పీసీసీ చీఫ్ ఉన్న రాష్ట్రంలో రాజధానిలో ఉన్నత శ్రేణి భవనానికి(4 బెడ్ రూమ్స్) పార్టీ అద్దె కడుతుంది. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కూడా చెల్లిస్తుంది. దీంతో పాటు.. సొంత పార్టీ కార్యాలయం పెట్టుకుంటే.. దాని అద్దెను కూడా పార్టీనే కడుతుంది. ఇలా.. మొత్తంగా ఒక పీసీసీ చీఫ్‌కు నెలకు పార్టీ పెట్టే ఖర్చు రూ.5 లక్షలకు మించకూడదని పార్టీ రాజ్యాంగం పేర్కొంటోంది. ఇవన్నీ.. ఇప్పుడు షర్మిలకు వర్తిస్తాయి.
అయితే.. ఇక్కడ ఒక మినహాయింపు ఉంటుంది. పీసీసీ చీఫ్‌గా ఉన్న నేత.. ప్రజాప్రతినిధిగా లేదా.. ప్రభుత్వ హోదాలో ఏదైనా పదవి ఉంటే.. జీతం రెండు లక్షలను ఇవ్వను. కేవలం పార్టీ ఖర్చుల కింద నెలకు రూ.50 వేలు మాత్రమే ఇస్తారు. ఇతర నేతలకు.. కూడా జీతాలు ఇస్తారు. ఇది .. కాంగ్రెస్ విధానం.
This post was last modified on January 17, 2024 6:44 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…