132 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే అందరినీ మెస్మరైజ్ చేయగలదు కాబట్టి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని కూడా బుగ్గలు నొక్కుకుంటున్న పరిస్థితి.. కళ్లు చెమర్చుతున్న పరిస్థితి కూడా కనిపిస్తే కనిపించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ వ్యూహమే అలాంటిది కాబట్టి!!
మొత్తంగా.. అసలు ఇంక లేదేమో.. ఉండబోదేమో.. అనుకున్న పార్టీని.. నిలబెట్టి.. పాదయాత్రతో పుంజుకునేలా చేసి పదేళ్ల పాటు అధికారం కట్టబెట్టేలా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణాన్ని ఆయన కుమార్తె వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చేసుకుని ఉండొచ్చని కూడా కొందరు అనుకుంటారు కాబోలు!!
కానీ.. రాజకీయ తెరలు.. కంటికి కమ్మిన పొరులు కొద్దిగా తొలగించి చూస్తే… కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తోందా? లేక.. వైఎస్ కుటుంబానికి తన కోసం వాడుకుంటోందా? అనేది తెలుస్తుంది. సుదీర్ఘ రాజకీయ కాలం కాంగ్రెస్‌తోనే అంటిపెట్టుకున్న వైఎస్ కుటుంబం పట్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రేమ ఒలకబోసిందని అనుకునేవారు.. ఒక్క విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి ఏపీలో కనుక కాంగ్రెస్ పుంజుకుని ఉంటే.. అధికారానికి దరిదాపుల్లో ఉంటే.. ఇప్పుడు షర్మిలకు ఇచ్చిన పదవిని ఇచ్చి ఉండేదా? అని!!
నిజానికి వైఎస్‌పై ప్రేమ ఉండి ఉంటే.. వైసీపీ ఆవిర్భావమే జరిగి ఉండేది కాదు. కాంగ్రెస్ కోసం.. కాంగ్రెస్ తరఫున పరితపించిన వైఎస్ పై నిజంగా ప్రేమ ఉండి ఉంటే.. కాంగ్రెస్ ఆనాడే పగ్గాలు ఇచ్చేది. కానీ.. అలా చేయలేదు. పోతే పోనీ.. అన్నట్టుగా వైఎస్ కుటుంబాన్ని వదలేసింది వాస్తవం. అంతేకాదు.. తమ పార్టీకి అడ్డు వస్తారన్న అక్కసుతో వైఎస్ కుటుంబాన్ని కేసుల చుట్టూ తిప్పింది ఈ కాంగ్రెస్ పార్టీనే. అంటే.. అంతిమంగా.. కాంగ్రెస్ కావాల్సింది.. తన స్వప్రయోజనం.. తన పార్టీ ప్రయోజనం తప్ప.. వ్యక్తులతో ఇక్కడ పనిలేదు.
నేడు షర్మిలకు పగ్గాలు ఇవ్వడం వెనుక చాలా దూరదృష్టి ఉంది. ఆమె తన అన్న సీఎం జగన్‌తో విభేదించి ఉండకపోతే.. వారి మధ్య రాజకీయ పరిస్థితి సజావుగా ఉండి ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉన్నా.. షర్మిల ముఖం చూసి ఉండేది కాదు. కాంగ్రెస్ కునారిల్లిన పరిస్థితిలో ఉండడం. తమ ఓటు బ్యాంకును, తమ నేతలను వైఎస్ జగన్ లాగేసుకున్నారనే దుగ్ధ పేరుకు పోయిన దరిమిలా.. ఏపీలో ఇప్పుడు షర్మిల అవసరం ఆ పార్టీకి వచ్చిందే తప్ప.. రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశం ఆ పార్టీని ఈషణ్మాత్రం లేదనడంలో సందేహం లేదు.
ఇదే ఉండి ఉంటే.. జగన్ పార్టీ పెట్టినప్పుడు నిలువరించి ఉండాల్సింది. వైఎస్ కుటుంబానికి ప్రాదాన్యం ఇస్తామని హామీ ఇచ్చి ఉండాల్సింది. పోనీ.. షర్మిల పార్టీ ప్రకటించినప్పుడైనా.. జోక్యం చేసుకుని మేమున్నామని వెన్నుత ట్టి ఉండాల్సింది. కానీ, ఇవేవీ కాంగ్రెస్ చేయలేదు. ఆనుపానులు చూసుకుని.. వైఎస్ కుటుంబం, ఆయన సానుభూతి మెట్లపై పైకి రావాలనే ఏకైక కారణంతోనే కాంగ్రెస్ ఇప్పుడు ప్రేమ కురిపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని షర్మిల గ్రహించాల్సి ఉంటుంది.
పార్టీని పార్టీగానే చూడాల్సిన అవసరం ఆమెకు ఎంతైనా ఉంది. అన్నతో రాజకీయంగా విభేదించినంతవరకు .. మంచిదే.. వ్యక్తిగత కారణాలను రాజకీయాల్లోకి చొప్పించి.. కాంగ్రెస్ను బలోపేతం చేస్తున్నామన్న మిషతో వ్యవహరిస్తే.. అంతిమంగా రేపు మరో షర్మిల కాంగ్రెస్ కు దొరకవచ్చు.. అప్పుడు ఈ షర్మిల.. మరో జగన్ కానూ వచ్చు! తస్మాత్ జాగ్రత్త!!
This post was last modified on January 17, 2024 4:04 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…