Political News

ఇది ఎన్నికల నోటీసేనా ?

ఉరుములేని పిడుగు అన్నట్లుగా సడెన్ గా కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు మంగళవారం హాజరవ్వాలంటు నోటీసులో ఈడీ చెప్పింది. కవిత ఏమిచేస్తారాన్నది వేరే విషయం. ఎందుకంటే విచారణను ఎలాగైనా తప్పించుకోవాలని కవిత శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీనికి ఒక సాకును చూపిస్తున్నారు. అదేమిటంటే మహిళలను విచారణ చేయాలంటే ఆపీసులకు పిలిపించకూడదట. అధికారులే ఇళ్ళకొచ్చి మహిళలను విచారించాలని రూల్ ఉందట. ఇదే విషయమై కవిత కోర్టులో పిటీషన్ కూడా వేశారు.

అయితే ఇలాంటి రూల్ ఏమీలేదని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని విచారించాలన్నా, లేదా వయసు అయిపోయిన వారిని విచారించాలన్నపుడు మాత్రమే ఇంటికి వెళ్ళే విషయాన్ని పరిశీలిస్తామని ఈడీ వాదిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న 78 ఏళ్ళ సోనియాగాంధి కూడా విచారణకు తమ ఆఫీసుకు వచ్చిన విషయాన్ని ఈడీ కోర్టుకు గుర్తుచేసింది. కవిత వాదన ఎలాగున్నా అసలు ఇప్పటికిప్పుడు కవిత ఈడీ ఎందుకు నోటీసు జారీచేసినట్లు ? ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందటానికే అనే ప్రచారం పెరిగిపోతోంది.

ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఎఫెక్టుచూపింది. బీఆర్ఎస్ ఓటమికి ఈ ప్రచారం కూడా ఒక కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపాత్రదారుగా ఆరోపణలున్నా కవితను అరెస్టు చేయకపోవటమే దీనికి ఉదాహరణగా కాంగ్రెస్ ప్రచారంచేసింది. ఈ ప్రచారం వల్ల బీజేపీ కూడా బాగానే నష్టపోయింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుని మోజారిటి సీట్లు గెలుచుకోవాలన్నది బీజేపీ టార్గెట్. తమకు బీఆర్ఎస్ కు సంబంధంలేదని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీ పైన పడింది.

అందుకనే అర్జంటుగా కవితకు ఈడీతో నోటీసులు ఇప్పించిందనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందటానికి అవసరమైతే కవితను అరెస్టు చేయించే అవకాశాలను కూడా కొట్టిపారేసేందుకు లేదు. అందుకనే కవితకు ఇపుడు వచ్చిన నోటీసులు అచ్చంగా రాజకీయపరమైన ఎన్నికల నోటీసేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మరి దీనికి కవిత, ఈడీయే సమాధానం చెప్పాలి.  

This post was last modified on January 16, 2024 2:53 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

32 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

57 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

1 hour ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

4 hours ago