రాబోయే ఎన్నికల్లో తెలంగాణా నుండి ప్రియాంక గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధిని పోటీ చేయించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏకగ్రీవ తీర్మానంచేసింది. మెదక్ లేకపోతే ఖమ్మం నుండి సోనియా పోటీచేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకనే సోనియా పోటీ విషయంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలకు కూడా పంపారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీలో ప్రియాంక గాంధి విషయమై బాగా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. సోనియా పోటీవిషయంలో తెరమీదకు వచ్చిన నియోజకవర్గాలే ఇపుడు ప్రియాంక విషయంలో కూడా చర్చల్లో నలుగుతున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఢిల్లీలో కలిసి పోటీచేయాలని ప్రియాంకను ఆహ్వానించారట. ఇదే విషయమై వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వే కూడా చేసినట్లు సమాచారం.
ఇపుడు విషయం ఏమిటంటే సోనియా ప్లేసులో రాబోయే ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. వయసు అయిపోవటం, తీవ్ర అనారోగ్యం కారణంగా సోనియా యాక్టివ్ పాలిటిక్స్ నుండి ఎప్పుడో తప్పుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప పబ్లిక్ అప్పీరెన్స్ ఉండటంలేదు. మొన్నటి తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా అవసరార్ధం వచ్చారే కాని ఆరోగ్యం బాగుండి కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సోనియా అసలు పోటీయే చేయకపోవచ్చని పార్టీ నేతలంటున్నారు. ఇపుడు సోనియా ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాబట్టి ప్రియాంక ను పోటీచేసేందుకు ఒప్పించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రియాంక గనుక పోటీకి అంగీకరిస్తే పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకపుడు మెదక్ నుండి ఇందిరాగాంధి పోటీచేసి గెలిచారు. అలాగే ఖమ్మంలో ఎక్కువసార్లు కాంగ్రెస్సే గెలిచింది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లలో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల గెలిచింది. దాంతో ఖమ్మంలో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి తల్లీ, కూతుళ్ళు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on January 16, 2024 12:31 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…