Political News

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రభుత్వానికి తాజాగా 14 పేజీల నివేదికతో పాటు లేఖను సమర్పించినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్‌ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.

సిట్‌ నివేదికలో అప్పటి, ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ బాలాజీ పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.

నెయ్యి సరఫరాకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, అవసరమైన నియమావళి తయారీలో నిర్లక్ష్యం వహించారని సిట్‌ తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. దీని కారణంగా నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.

సిట్‌ సిఫారసుల నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కల్తీ నెయ్యి సరఫరాకు కారణం టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తీసుకొచ్చిన మార్పులేనని సిట్‌ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ మార్పులను అప్పట్లో ఈవో స్థాయిలో సకాలంలో గుర్తించకపోవడం లేదా గుర్తించినా పట్టించుకోకపోవడం క్షమించరాని నిర్లక్ష్యంగా సిట్‌ అభిప్రాయపడినట్టు సమాచారం.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గిన అంశాలపై సిట్‌ గట్టిగా అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం.

This post was last modified on January 31, 2026 10:49 am

Share
Show comments
Published by
Kumar
Tags: TTD EO

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

13 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago