Political News

అంబేడ్క‌ర్ మీద జ‌గ‌న్ ఆశ‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మ‌రింత‌గా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వ‌ర్గాన్ని, చ‌దువరుల‌ను కూడా వైసీపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే .. ఆఘ‌మేగాల‌పై విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించారు.

ప్ర‌త్యేకంగా మంత్రుల క‌మిటీని నియ‌మించి మ‌రీ.. వైసీపీ అధినేత ఈ నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసు కున్నారు. మొత్తంగా విగ్ర‌హం ప్రారంభానికి రెడీ అయింది. ఈ నెల 19న అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కూడా చేప‌ట్ట‌నున్నారు. సీఎం జ‌గ‌న్ దాదాపు అర‌గంట‌కు పైగానే ఈ వేదిక నుంచి ప్ర‌సంగించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే..  గ్రామాల్లో సంబ‌రాలు కూడా చేప‌ట్టారు. ఒక‌వైపు సంక్రాంతి సంబ‌రాలు సాగుతుండ‌గా.. మ‌రోవైపు, అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి సంబంధించి అధికారికంగా వైసీపీ సంబ‌రాలు చేప‌ట్టింది.

ఈ సంద‌ర్బంగా వైసీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చేస్తున్న మేళ్లు.. గ‌త ప్ర‌బు త్వం చేసిన వాటిని కూడా ఏక‌రువు పెడుతున్నారు. ప్ర‌దానంగా రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటికి అనుబందంగా 7 ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని టార్గెట్ చేయ‌డం ద్వారా.. గ‌తానికి భిన్నంగా.. మొత్తం స్థానాల్లో విజ‌యం ద‌క్కించు కోవాల‌నేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఇక‌, పార్టీల‌ను వ్య‌తిరేకించేవారు.. లేదా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండేవారు కూడా.. స‌మాజంలో ఉన్నారు.

వీరిలో మేధావులు విద్యావంతులు, త‌ట‌స్థులు ఉన్నారు. రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకించే వారు కూడా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్‌ను మాత్రం విస్మ‌రించ‌రు.. దీనిని గుర్తించిన వైసీపీ ఇలాంటి వారిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. వీరితోనే అస‌లు చిక్కు ఉంద‌ని గ్ర‌హించిన పార్టీ.. అంబేడ్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు అనేక మంది మేధావులను.. ప్రొఫెస‌ర్ల‌ను కూడా ఆహ్వానిస్తోంది. త‌ద్వారా.. తాము అంద‌రికీ ఒక్క‌టేన‌న్న సంకేతాలు పంపించాల‌ని చూస్తోంది. మొత్తంగా చూస్తే.. అంబేడ్క‌ర్ విగ్ర‌హం ద్వారా.. వీరి ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా?  కాదా? అన్న‌ది చూడాలి.

This post was last modified on January 14, 2024 6:55 pm

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

1 hour ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

1 hour ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

3 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

4 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

5 hours ago