ఢిల్లీలో రేవంత్ రెడ్డి బాగా బిజీబిజీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటికే చాలాసార్లు రేవంత్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ అగ్రనేతలు, అధిష్టానం ఢిల్లీలోనే ఉండటంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయక రేవంత్ కు తప్పటంలేదు. రేవంత్ అనే కాదు జాతీయపార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇది తప్పదు. అందుకనే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే రేవంత్ కనీసం 15 రోజులు ఢిల్లీలోనే గడిపారు.
సరే ప్రస్తుత విషయానికి వస్తే రెండురోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే క్యాంపేశారు. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరిని రంగంలోకి దింపాలనే విషయాలను తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో పాటు వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు ఎన్నికలంటే జాతీయస్ధాయి అంశాలకు సంబందించినవి కాబట్టి హామీల విషయంలో తెలంగాణాకు ప్రత్యేకంగా ఇచ్చే హామీలేమీ ఉండవు.
అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎంత స్పీడుగా చర్యలు తీసుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో అంత సానుకూల ఫలితాలు వస్తాయని సునీల్ చెప్పారట. ఇప్పటికే సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని అమల్లోకి తెచ్చేశారు. మిగిలిన నాలుగు హామీలపైన కసరత్తు జరుగుతోంది. ఆ కసరత్తునే స్పీడు చేయాలని సునీల్ చెప్పారట. నెలన్నర రోజుల కాంగ్రెస్ పాలనలో జనాల స్పందన సానుకూలంగానే ఉందని సమావేశం హ్యాపీగా ఫీలైందని సమాచారం. అయితే ఇది సరిపోదు కాబట్టి అభ్యర్ధుల ఎంపీకలో జాగ్రత్తలు తీసుకోవాలని సునీల్ చెప్పారట.
నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే సునీల్ సర్వేలను మొదలుపెట్టారట. ఆశావహుల జాబితాలను తయారుచేసి వాటిల్లో నుండి వడపోత మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సర్వే వివరాలతో రేవంత్ ఆలోచనలను కూడా విశ్లేషిస్తున్నారు. అన్నింటినీ కలిపి తొందరలోనే అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికల్లో గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధి, రాహూల్ గాంధి, ప్రియాంకగాంధీలతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. దాంతో ప్రచారానికి ప్రియాంకను తెలంగాణాకు తీసుకురావాలని ప్లాన్ జరుగుతోంది. భారత్ జోడోయాత్ర రెండో విడత మొదలైన కారణంగా రాహూల్ ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on January 14, 2024 10:04 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో సంపద సృష్టి జరిగిందని చెప్పుకొచ్చారు.…
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆనంద పడుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి…
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…