టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు.. తాజాగా డిన్నర్ భేటీ నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరగనున్న ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉందని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. అత్యంత తక్కువ మందిని మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి నలుగురు మాత్రమే ఈ డిన్నర్ బేటీకి హాజరవుతు న్నట్టు తెలిసింది. ప్రస్తుతం విజయవాడలోనే చంద్రబాబు.. సీఐడీ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ నుంచి మరోసారి తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం.. ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.
ఈ రోజు రాత్రికి ఉండవల్లిలోనే ఉండనున్న చంద్రబాబు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి పవన్ కళ్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ సహా మరో ఇద్దరు హాజరుకానున్నారు. ఇక, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు సహా ఇంకో ఇద్దరు నుంచి ముగ్గురు పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు సహా.. వైసీపీ నుంచి బయటకు వస్తున్న నాయకులను చేర్చుకునే విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని సమాచారం.
వీటన్నింటికంటే ముఖ్యంగా.. టీడీపీ-జనసేన పార్టీల కు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను సంక్రాంతి సందర్భంగా ప్రక టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జాబితాపై ప్రధానంగా తుది కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ నుం చి వచ్చే వారి చేరికల అంశాలను కూడా.. చంద్రబాబు పవన్‌లు చర్చించనున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏర్పాటు చేయనున్న సభలు.. ఉమ్మడి కార్యాచరణ, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు.. వంటి కీలకమైన అంశాలపై.. చంద్రబాబు, పవన్‌లు ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. డిన్నర్ భేటీనే ఎన్నికలకు ముందు జరగబోయే కీలక భేటీ అని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఇక, నుంచి చంద్రబాబు, పవన్‌లు నేరుగా ప్రజాక్షేత్రంలోనే కనిపిస్తారని అంటున్నారు.
This post was last modified on January 13, 2024 9:05 pm
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…