వైసీపీలో టికెట్ దక్కని, సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన నేతలు పార్టీని వీడుతున్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీకి సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే పార్థసారథి రాంరాం అనబోతున్నారని టాక్ వస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యేందుకు పార్థ సారధి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నూజివీడు లేదా పెనమలూరులో ఒక టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా తెలిపిందని తెలుస్తోంది.
విజయవాడలోని తన ఆఫీసులో టీడీపీ నేతలతో కూడా పార్థ సారధి భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో ‘రా.. కదలి రా’ సభా వేదికపై చంద్రబాబు సమక్షంలో పార్థసారథి సైకిల్ ఎక్కబోతున్నారట. మంత్రి పదవి దక్కకపోవడంతో చాలాకాలంగా వైసీపీపై పార్థ సారధి అసంతృప్తిగా ఉంటూ బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పెనమలూరు టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట. కానీ, ఆ ప్రచారాన్ని పార్థసారధి ఖండిస్తున్నారు.
మరోవైపు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి టాటా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దొరబాబుకు టికెట్ లేదని జగన్ తేల్చేయడం, ఆయన స్థానంలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ గీతను నియమించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో, ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా తన అనుచరులు, అభిమానులతో బల ప్రదర్శన చేయబోతున్నారు దొరబాబు. పిఠాపురంలోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులకు ఆత్మీయ విందు ఇచ్చి పార్టీ మార్పుపై కూడా చర్చిస్తారట.
This post was last modified on January 12, 2024 4:20 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…