ఏపీలో మరో రెండు మాసాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ రెండే కాదు.. ఇప్పుడు మరో ఎన్నిక కూడా తెరమీదికి వచ్చింది. అదే రాజ్యసభ ఎన్నికలు. మొత్తం 3 స్థానాలకు ఈ సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే.. ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విషయం మాత్రమే రాజకీయంగా ప్రాధాన్యం ఉంది.
కానీ, ఇదేసమయంలో చాపకింద నీరులా.. మూడు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడలోనే ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. వైసీపీకి చెందిన ఒకరు, టీడీపీకి చెందిన మరొకరు.. టీడీపీ తరపున టికెట్ సొంతం చేసుకుని తర్వాత బీజేపీ బాటపట్టిన మరొకరు కూడా ఏప్రిల్ మాసాంతానికి రిటైర్ కానున్నారు, వారే.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(వైసీపీ), కనకమేడల రవీంద్రకుమార్(టీడీపీ), సీఎం రమేష్(టీడీపీ నుంచి బీజేపీ)లు ఉన్నారు.
ఈ మూడు ఎన్నికలు కూడా.. నామినేటెడ్ కాదు. నేరుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఎన్నుకుంటారు. దీంతో ఈ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు మించి ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న వైసీపీ ఈ మూడు దక్కిం చుకునే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రంలో మారిన సమీకరణలు.. రాజకీయ వైరాల నేపథ్యంలో టీడీపీ కూడా బలంగానే పోరాడేందుకు రెడీ అయింది.
కనీసం ఒక్కస్థానాన్నయినా.. తాము దక్కించుకుంటామని తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు ఎనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అంటే. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన క్రాస్ ఓటింగ్ కారణంగా.. టీడీపీ విజయం దక్కించుకున్నట్టుగానే .. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతంటికెట్ దక్కని వారు.. చాలా మంది వైసీపీలో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో వారంతా .. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి లోపాయికారీ మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక, ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ తన వారిని రెబల్స్‌గా మారకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. మొత్తంగానికి అసెంబ్లీ-పార్లమెంటుతో పాటు రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో సెగలు పుట్టిస్తుండడం గమనార్హం.
This post was last modified on January 11, 2024 10:43 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…