రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటం లేదట. కారణం ఏమిటంటే రెండో ఎన్నికకే నియోజకవర్గం మారాల్సి రావటమే కారణమని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ చర్చంతా మంత్రి విడదల రజని గురించే. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని రాజకీయాలపై ఇంట్రెస్టుతో రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. రావటం రావటమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీలో టికెట్ రాదని అర్ధమవ్వగానే వెంటనే వైసీపీలో చేరిపోయారు.
రజనీది గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం. బీసీ సామాజికవర్గానికి చెందిన రజనీ స్వతహాగానే చాలా స్పీడుగా ఉంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేటప్పుడే టికెట్ పై హామీ తీసుకున్నారు. అప్పటినుండి నియోజకవర్గంలో ప్రచారంతో దూసుకుపోయారు. మొత్తానికి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావును ఎన్నికల్లో 8300 ఓట్లతో ఓడించారు. అమెరికా నుండి రావటమే టికెట్ అందుకోవటమే గొప్పనుకుంటే గెలవటం మరింత గొప్పగా చెప్పుకోవాలి. ఇంతేకాకుండా మంత్రి కూడా అయిపోయారు.
ఎప్పుడైతే మంత్రయిపోయారో అప్పటినుండే నియోజకవర్గంలో సమస్యలు మొదలయ్యాయి. రజనికి ముందు వరకు ఇన్చార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ తో పడలేదు. తర్వాత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతో గొడవలు. నియోజకవర్గంలో చాలామంది ప్రత్యర్ధులైపోవటంతో వచ్చే ఎన్నికల్లో రజని గెలుపు కష్టమని ప్రచారం మొదలైపోయింది. దానికి తోడు జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో రజనీపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే గుంటూరు వెస్ట్ కు మార్చారు. గుంటూరు వెస్ట్ లో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మంత్రిని ఇక్కడకు మార్చినట్లున్నారు.
అయితే వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి చొచ్చుకుపోగలరా ? ఎన్నికల్లో పార్టీలోని నేతలు, క్యాడర్ను కూడదీసుకుని గెలవగలరా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రికి రాబోయే ఎన్నికల్లో ఎంతమంది సహకరిస్తారో తెలీటంలేదు. రజని గెలిస్తే భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. అదే ఓడిపోతే మాత్రం కష్టాలు తప్పవు. ఓడిపోతే ఇటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కంటిన్యూ అవలేక, మళ్ళీ చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్ళలేక రజనీ ఇబ్బంది పడాల్సిందే. అందుకనే మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధం కావటం లేదు.
This post was last modified on January 11, 2024 2:32 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…