కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు.
జగన్ నిర్ణయంతో కాపు మండిపోతున్నారు. అందుకనే తాను ఏదోపార్టీలో చేరటమా ? లేకపోతే తన భార్యతో కలిసి ఇండిపెండెంట్లుగా పోటీచేయటమా ? అన్నది తొందరలోనే చెబుతానని మూడురోజుల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే తాజాగా తన భార్యతో కలిసి రఘువీరాతో భేటీ అవటంతో కాపు కుటుంబం కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కాపుకు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరితే టికెట్ దక్కే అవకాశంలేదు.
కాంగ్రెస్ లో చేరితే టికెట్ దక్కటం ఖాయం. అయితే తాను మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే తన భార్యకు కూడా కాపు టికెట్ అడుగుతున్నారా అన్నదే తెలీటంలేదు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాపు నాలుగోసారి ఏ పార్టీ తరపున పోటీచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తరపున 2009లో పోటీచేసి గెలిచారు. తర్వాత పార్టీలో నుండి బయటకు వచ్చేసి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయినా 2019లో మళ్ళీ అదే కాలువపై గెలిచారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి గెలుద్దామని అనుకుంటున్న కాపుకు జగన్ పెద్ద సాకే ఇచ్చారు. దాంతో నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. అయితే గెలుపే అనుమానంగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి అందరికీ తెలిసిందే కాబట్టి వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లిచ్చినా గెలుపు గ్యారెంటి అని అనుకునేందుకు లేదు.
This post was last modified on January 10, 2024 10:12 am
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…