విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు వివరించామన్నారు. గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయని, నచ్చిన పోలీసులను ఎన్నికల సమయానికి విధుల్లో ఉండేలాగా వైసీపీ నేతలు చూసుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.
ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతూ ఇక్కట్ల పాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీతో పాటు జనసేన తరఫున అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించామని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే అందులో ఒక వంతు ఆమోదించారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో, పారదర్శక ఎన్నికల కోసం ఆయన ఎలా కృషి చేశారో ఎన్నికల సంఘం అధికారులకు వివరించామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని సీఈసీ అధికారులకు విన్నవించినట్టుగా చెప్పారు. తాము చెప్పిన విషయాలను అధికారులు సావధానంగా విన్నారని, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారని పవన్ చెప్పారు. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని, నికార్సయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మారుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 9, 2024 2:57 pm
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దొంగతనం…
ఒక్కో జానర్కు ఒక్కో రీచ్ ఉంటుంది. కొన్ని జానర్ల సినిమాలకు వసూళ్ల పరంగా పరిమితులు కూడా ఉంటాయి. వందల కోట్ల…
తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత…