Political News

ఈ సీట్ల‌న్నీ ఎన్నారైల‌కేనా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎన్నారైల‌కు పెద్ద‌పీట వేయ‌నుందా? మెజారిటీ స్థానాల్లో ఎన్నారై టీడీపీ నాయ‌కు ల‌కు సీట్లు కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే చ‌ర్చే తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఎన్నారై నాయ‌కుడు వెనిగ‌ళ్ల రాముకు చంద్ర‌బా బు కేటాయించారు. దీంతో రాము ప్ర‌చారంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్ర‌జ‌న‌లు కూడా క‌లుస్తున్నారు.

ఇక‌, ఒక్క గుడివాడే కాకుండా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఎన్నారైల‌కు చంద్ర‌బాబు టికెట్లు ఖ‌రారు చేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వీటిలో ప్ర‌ధానంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చేందుకు స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజ‌క‌వ‌ర్గంలోనూ మార్పుల‌కు శ్రీకారం చుట్టారు.

ఇక్క‌డ నుంచి ఎన్‌ఆర్‌ఐ కొంప కృష్ణకు టికెట్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఇక‌, ఇదే జిల్లా నెల్లిమర్లలోనూ మార్పులు త‌థ్య‌మ‌ని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీలో పెద్ద‌గా దూకుడు చూపించ‌ని మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈయ‌న స్థానంలో ఎన్నారై నేత‌ బంగార్రాజుకు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి కూడా ఈ ద‌ఫా ఎన్‌ఆర్‌ఐ గోనెల విజయచంద్ర పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి 8 నుంచి 10 స్థానాల్లో ఎన్నారైల‌కు ఈ ద‌ఫా టికెట్లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో 4 నుంచి 6 పార్ల‌మెంటుస్థానాల‌ను కూడా ఎన్నారైల‌కు కేటాయించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతోంది.

ఇవీ.. కార‌ణాలు

ఉన్న‌ప‌ళంగా టీడీపీలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నారైల‌కు టికెట్లు ఇవ్వ‌డానికి కార‌ణాలు కూడా అనేకం ఉన్నాయ‌ని పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌ధానంగా వైసీపీ నేత‌ల ఆర్థిక పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం ఒక‌టైతే.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించ‌డంలో స్థానిక నాయ‌కులు విఫ‌లం కావ‌డం కూడా మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఎన్నారై పార్టీ నాయ‌కులు గ‌త ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో వారిని సంతృప్తి ప‌ర‌చాల‌నేది టీడీపీ అధినేత వ్యూహంగా ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on January 8, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగనే ఎక్కువ సంప‌ద సృష్టించారట

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్రంలో సంప‌ద సృష్టి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.…

8 hours ago

తిరుపతి ప్రసాదం పై పవన్ కమెంట్స్

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…

9 hours ago

రాహుల్ కంటే ప్రియాంకే బెట‌ర్‌?.. కాంగ్రెస్‌లో సంకేతాలు!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సార‌థ్యంపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్…

9 hours ago

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి…

10 hours ago

కొన్ని కొన్ని సార్లు మిస్ చేసుకోడమే మంచిది సిద్ధార్థ్…

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…

12 hours ago