వైసీపీలో ఇలా చేరి అలా బయటకు వచ్చిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాన్ని వెల్లడించారు. తిరిగి తాను క్రికెటర్‌గా అరంగేట్రం చేయనున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 20 నుంచి దుబాయ్‌లో జరగనున్న ఐఎల్‌టీ 20లో తాను ఆడనున్నట్టు చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండరాదనే నిబంధన ఉందని.. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. అంబటి రాయుడు వైసీపీలో చేరడం.. ఆ వెంటనే ఆరు రోజులకే ఆయన బయటకు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా వైసీపీ రెబల్ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైజం నచ్చకే.. ఆయన బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. ఆరు రోజుల్లోనే పార్టీ పరిస్థితి ఆయనకు అర్థమైందని కొందరు విమర్శలు గుప్పించారు. అంబటికి.. వైసీపీకి పొసగదని, ఆయన సౌమ్యుడని.. కానీ, వైసీపీలో కఠినంగా ఉండే నాయకులకే చోటు ఉంటుందని.. అందుకే ఆయన తప్పుకొన్నారని కూడా విశ్లేషించారు.
ఇక, మరికొందరు.. అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారని చెప్పారు. అయితే.. దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించలేదని.. అందుకే బయటకు వచ్చేశారని విశ్లేషించారు. అంబటి రాయుడును మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఒత్తిడి చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతగా రాజకీయ విమర్శలు వచ్చినా.. వైసీపీ నాయకులు సంయమనం పాటించారు. ఎవరూ ఎక్కడా రాయుడి గురించి పన్నెత్తు మాట అనలేదు. ఇంతలోనే రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాలు వెల్లడించడంతో ఈ వివాదం టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లారిపోయింది.
This post was last modified on January 7, 2024 8:44 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…