వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేనల మధ్య మిత్రత్వం మరింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇక నుంచి ఏం చేయాలన్నా.. ఏవిషయంపై గళం విప్పాలన్నా.. ఏ అంశంపై పోరాటం చేయాలన్నా.. ఉమ్మడిగానే ముందుకు సాగాలని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని తాజాగా నిర్ణయించారు. దీనిపై తాజాగా హైదరాబాద్‌లో ఇరువురు నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు, పవన్‌లు సంయుక్తంగా భేటీ కావాలని నిర్ణయించారు.
ఈనెల 9వ తేదీన విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు సంయుక్తంగా ఈసీ బృందాన్ని కలిసి.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేశారు. పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఈసీని కలవనున్న నేపథ్యంలో ఈ సభను వాయిదా వేశారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.
This post was last modified on January 7, 2024 12:19 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…