రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా తెలంగాణా బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరుకుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి ఆర్ధికంగా బాగా స్ధితిమంతులే పోటీలు పడుతున్నారు. సహజంగా అయితే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న వాళ్ళు ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ రివర్సులో కొందరు కాంగ్రెస్ ను కాదని, బీఆర్ఎస్ ను వద్దనుకుని బీజేపీ లో చేరటానికి ఎందుకింత ఇంట్రెస్టు చూపుతున్నట్లు ?
ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరి టికెట్ల కోసం ప్రయత్నించినా ఉపయోగం ఉండదనే. కారణం ఏమిటంటే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోనే ఉన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చాలా మీడియా సంస్ధలు ప్రీపోల్ సర్వేల్లో చెబుతున్నాయి. అందుకనే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని ఎంపీగా పోటీచేసి గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు.
మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేయటానికి డీపీఎస్, పల్లవి ఎడ్యుకేషన్ గ్రూప్ సంస్ధల ఛైర్మన్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో బాగా పాతుకుపోయిన మల్క కొమరయ్య ఉత్సాహం చూపిస్తున్నారు. ఈయనకు ఆర్ధికంగా ఎలాంటి లోటు లేదు. అలాగే తన సంస్ధల కారణంగా అంగబలానికి కూడా కొదవలేదు. ఇక జహీరాబాద్ ఎంపీగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈయన కూడా ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అలాగే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి ఓల్డ్ సిటీలోని వ్యాపారవేత్త బాగా ఆసక్తి చూపుతున్నారట. ఈయనకు గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ గట్టి మద్దతిస్తున్నారట. విచిత్రం ఏమిటంటే జహీరాబాద్ ఎంపీగా చికోటి ప్రవీణ్ తో పాటు రాజాసింగ్ కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక నలుగురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో మళ్ళీ పోటీ చేయబోతున్నారు. పార్టీలోనే జితేందర్ రెడ్డి లాంటి కొందరు పారిశ్రామికవేత్తలున్నారు. వీళ్ళు కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…