జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్ ఇస్తామంటూ.. ఓ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఆయనను సాదరంగా ఆహ్వానించింది. మీకు డాక్టరేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. పవన్ కళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫర్‌పై నిశితంగా స్పందించారు. తనకు ఈ డాక్టరేట్ అవసరం లేదని చెప్పారు. సమాజంలో తనకన్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవరినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు యూనివర్సిటీ వెనక్కితగ్గింది.
ఇదీ విషయం..
తమిళనాడులోని ప్రముఖ ‘వేల్స్ యూనివర్సిటీ’ 14వ స్నాతకోత్సవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. అంతేకాదు.. తాము డాక్టరేట్ ఇవ్వాలని భావిస్తున్నామని, దీనిని స్వీకరించాలని వర్సిటీ కోరింది. డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఈ మేరకు పవన్ సదరు యూనివర్సిటీకి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తోన్నందున బిజీగా ఉన్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. వర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని తెలిపారు. సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు. కాగా, సదరు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం వెనుక పవన్ కళ్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించడంపై అతని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.
This post was last modified on January 6, 2024 7:11 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…