జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీ పెంపు కోసం ఏపీలో అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంగన్వాడీల సమ్మెను పట్టించుకోని జగన్ ప్రభుత్వం వారిని చర్చలకు కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా, ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. అయినా సరే వెనక్కి తగ్గబోయేది లేదని అంగన్వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. అంగన్వాడీలపై ఉక్కు పాదం మోపిన జగన్ సర్కార్ వారిపై ఎస్మా ప్రయోగించింది.
అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులోకి చేర్చిన జగన్ సర్కార్…రాబోయే 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం శనివారం నాడు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా, గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలలోనూ కోత విధించింది. సమ్మె కాలానికి జీతాన్ని కట్ చేస్తూ మిగిలిన జీతాన్ని వారి ఖాతాలలో జమ చేసింది.
ప్రజల సాధారణ జీవితం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తుంటారుర. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం వైద్యం, ప్రసార సాధనాలు వంటి అత్యవసర సేవలకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తుంటారు. కానీ, ఏపీలో మొదటిసారి అటువంటి అత్యవసర సర్వీస్ కాని అంగన్వాడి సేవలపై ఎస్మా ప్రయోగించడం హాట్ టాపిక్ గా మారింది. మరి, సమ్మెను విరమించి అంగన్వాడీలు విధుల్లో చేరుతారా లేకపోతే సమ్మెను కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 6, 2024 5:37 pm
సమాజంలోని ఏ కుటుంబమైనా.. తమకు ఓ గూడు కావాలని తపిస్తుంది. అయితే.. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. పేదలు,.. అత్యంత…
అసలు బాలీవుడ్ లోనే కనిపించడం మానేసిన సీనియర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హఠాత్తుగా టాలీవుడ్ క్రేజీ అవకాశాలు పట్టేస్తుండటం ఆశ్చర్యం…
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…