బీఆర్ఎస్ లో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తొందరలో భర్తీ అవబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమిచేయాలో కేసీయార్ కు అర్ధంకావటం లేదట. ఇక్కడ క విచిత్రమైన పరిస్ధితి ఉంది. అదేమిటంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీ ఎన్నికలో ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ కు రెండు సీట్లను గెలుచుకునేంత సీన్ లేదు. బీఆర్ఎస్ కు అయితే అసలు ఒక్క స్థానం గెలిచే అవకాశం కూడా లేదు.
కాంగ్రెస్ లో 64 మంది ఎంఎల్ఏలున్నారు. కాబట్టి 40 ఓట్లుపోను ఇంకా 24 ఓట్లు మిగిలే ఉంటాయి. ఇక బీఆర్ఎస్ తరపున గెలిచింది 39 మంది ఎంఎల్ఏలు మాత్రమే. అంటే ఒక్క సీటు గెలుచుకునేందుకు కారుపార్టీకి ఒక్క ఓటు అవసరం. మామూలుగా అయితే ఈ ఒక్క ఓటు తెచ్చుకోవటం బీఆర్ఎస్ కు పెద్ద కష్టంకాదు. ఎలాగంటే మజ్లిస్ మద్దతుతో. కానీ మారిన పరిస్ధితుల్లో మజ్లిస్ బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారగనే మజ్లిస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించేసింది. ఇపుడు టీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ తో తంటా. కాబట్టి ఎంఐఎం మద్దతు దొరుకుతుందని అనుకునేందుకు లేదు.
ఇంతవరకు లెక్కలు స్పష్టంగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గనుక రెండో అభ్యర్ధిని కూడా పోటీలోకి దింపితే ఏమి చేయాలన్న విషయంలోనే కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోందట. ఎందుకంటే అవసరమైన 16 ఓట్ల వ్యవహారాన్ని చూసుకునే కాంగ్రెస్ రెండో అభ్యర్ధిని పోటీలోకి దింపుతుందని అర్ధమైపోతుంది. అవసరమైన 16 ఓట్లంటే అవి బీఆర్ఎస్ నుండి లాక్కునే వ్యూహం పన్నితేనే రెండో అభ్యర్ధిని రెడీ చేస్తుంది.
అదే జరిగితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు క్రాస్ ఓట్లు వేసేది ఎవరు ? అన్నదే ఇపుడు కీలకమైన పాయింట్. గతంతో క్రాస్ ఓటింగ్ కు, ఫిరాయింపులను కేసీయార్ యధేచ్చగా ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే తమ పరిస్ధితి ఏమిటన్నదే కేసీయార్ కు అర్ధంకావటంలేదని సమాచారం. గెలిచిన 39 మందిలో 16 మంది జారిపోతే మిగిలేది 23 మంది మాత్రమే. వీరిలోకూడా ఎంతమంది పార్టీలోనే ఉంటారన్నది అనుమానమే. మొత్తంమీద ఇలాంటి లెక్కలే ఇపుడు కేసీయార్లో టెన్షన్ పెంచేస్తోందట.
This post was last modified on January 7, 2024 4:20 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…