రాజకీయాల్లో మార్పులు.. చేర్పులు సహజమే. అయితే.. ఈ మార్పులు ప్రత్యర్థి పార్టీకి బలాన్ని చేకూర్చడ మే ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తూ.. వైసీపీ సంచలనాలకు తెరదీసింది. దీనిలో భాగంగా కీలకమైన అనంతపురం పార్లమెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువచ్చింది.
ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టారు. వాస్తవానికి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణకు స్థానికంగా పార్టీలో వ్యతిరేకత వచ్చింది. ఆయనను వ్యతిరేకిస్తూ.. చాలా మంది నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహించి.. పార్టీ అధి ష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. అలాంటి నాయకుడిని తీసుకువచ్చి ఏకంగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం.. పార్టీలో చర్చకు దారితీసింది.
ఇక, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం.. స్థానిక జేసీ పవన్‌కుమార్‌కు బూస్ట్ ఇచ్చిందనే వాదన వినిపిస్తోంది. టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ పవన్‌కుమార్ పరాజయం పాలయ్యారు. దీనికి కారణం.. తలారి రంగయ్య వంటి కీలక మాజీ అధికారికి వైసీపీ టికెట్ ఇవ్వడమనే చర్చ సాగింది. పైగా.. అప్పట్లో కొంత వైసీపీకి అనుకూల పవనాలు కూడా ఉన్నాయి. దీంతో తరాలి రంగయ్య విజయం దక్కించుకున్నా రు.
కానీ, ఇప్పుడు వ్యతిరేకతను ఎదుర్కొంటున్న శంకరనారాయణకు కీలకమైన అనంతపురం పార్లమెంటు స్థానాన్ని కట్టబెట్టడం.. స్థానికంగా ఆయనకు వ్యతిరేకత కొనసాగుతుండడం.. పైగా.. జేసీ వర్గానికి మరింత బలం పెరగడం నేపథ్యంలో అనంతపురంలో జేసీ పవన్ గెలుపును రాసిపెట్టుకోవచ్చనే వాదన వినిపిస్తోం ది. ఇదే జేసీ పవన్‌కు కూడా బలాన్ని చేకూరుస్తోంది. ప్రత్యర్థి బలహీనతలు ముందుగానే తెలిసి ఉండడం.. వైసీపీ ఐదేళ్ల పాలనపై కొంత వ్యతిరేకత సహజంగా ఉండడంతో జేసీ పవన్ కూడా హ్యాపీగానే ఉన్నారని ఆ వర్గం చెబుతుండడం గమనార్హం.
This post was last modified on March 8, 2024 2:32 pm
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…