మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కేటీయార్ వైఖరిని దుమ్ము దులిపేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేటీయార్ స్వయంకృతమనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ చేస్తున్న ప్రతి విమర్శా రివర్సు కొడుతోంది. అందుకనే కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ తాజాగా 420 పేరుతో ఒక బుక్ లెట్ విడుదల చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసాలే(420) అని ఆ పుస్తకంలో రెచ్చిపోయారు. వందరోజుల్లో సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలను మోసంచేసిందని గోలగోల చేశారు. ఇక్కడే కేటీయార్ సెల్ఫ్ గోల్ బయటపడింది. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ పార్టీ కూడా వందరోజుల్లో అమలుచేయటం సాధ్యంకాదు. ఎన్నికల్లో గెలుపుకు పార్టీలు అనేక హామీలిస్తుంటాయి. అయితే అందులో కీలకమైనవి ఏవి ? వాటి అమలుకు ఏమిచేస్తోందన్నది చాలా ముఖ్యం.
ఈ లెక్కన చూస్తే సిక్స్ గ్యారెంటీస్ లో ఇప్పటికే రెండింటిని అమల్లోకి తెచ్చేసింది. రు. 500కే గ్యాస్ అన్న పథకం అమలుకు కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మి పేరుతో మహిళలకు ఇస్తామని చెప్పిన నెలకు రు. 2500 హామీ అమలుకు విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. సిక్స్ గ్యారెంటీస్ అమలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉందన్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడ అన్నింటికన్నా కీలకమైనది ఏమిటంటే ఏ పథకం అమలు కావాలన్నా నిధుల కేటాయింపు చాలా కీలకం.
ఆ నిధుల విషయంలోనే కేసీయార్ పదేళ్ళ పాలన ఖజానాకు పెద్ద బొక్కపెట్టేసింది. రు. 7 లక్షల కోట్ల అప్పుల ప్రభుత్వానికి ఇపుడు కాంగ్రెస్ సారధ్యం వహిస్తోంది. కాబట్టి హామీల అమలుకు కాస్త సమయం పట్టడం తప్పదు. పదేళ్ళు అధికారంలో ఉండి జనాలను మోసంచేసిన విషయాన్ని కేటీయార్ మరచిపోయారా ? అంటు నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు. కేసీయార్ గడచిన రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలుచేశారని నెటిజన్లు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే 420 ప్రభుత్వం అని కేటీయార్ ఆరోపించటంపై జనాలు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. దీంతో కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అనే ప్రచారం పెరిగిపోతోంది.
This post was last modified on January 5, 2024 11:55 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…