వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ సీఎం జగన్ నిన్న రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు సర్దుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును విజయవాడ వెస్ట్ కు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. అయితే, ఈ నిర్ణయంతో సంతృప్తిగా లేని మల్లాది విష్ణు సైలెంట్ గా ఉన్నారు. దీంతో, ఆయనను కలిసేందుకు వెల్లంపల్లి స్వయంగా మల్లాది విష్ణు ఇంటికి వెళ్లారు. అయితే, వెల్లంపల్లితో ముక్తసరిగా విష్ణు మాట్లాడడంతో ఆ భేటీ 15 నిమిషాల పాటే సాగింది. దీంతో, వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.
షర్మిల వెంట నడిచేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నట్టుగా బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు తన అనుచరులు, కార్పొరేటర్లతో మల్లాది విష్ణు పలుమార్లు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పిన విష్ణుకు…వైసీపీ అధిష్టానం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల తో విష్ణు టచ్ లో ఉన్నారని, తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా విష్ణు తో మాట్లాడేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో వైసీపీకి విష్ణు గుడ్ బై చెప్పేసినట్లేనని టాక్ వస్తోంది.
This post was last modified on January 3, 2024 11:03 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…