కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ నేపధ్యంలోనే గృహలక్ష్మి పథకం రద్దుచేసినట్లు జీవో జారిఅయ్యింది. ఈ పథకంలో భాగంగానే లబ్దిదారులకు నిధులు మంజూరు చేయాలని ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులను ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అర్హులకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి లబ్దిదారులను ఎంపిక చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. లబ్దిదారుల ఎంపిక తర్వాత అవసరమైన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఇంటికి రు. 3 లక్షల చొప్పున 4 లక్షల మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం చేయాలని కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే 2.11 లక్షలమందికి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం శాంక్షన్ లెటర్లను కూడా జారిచేసింది. శాంక్షన్ లెటర్లను జారీచేసిందే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అందుకనే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలకు సాయం చేయాలంటు జనాలు ప్రభుత్వన్ని రిక్వెస్టు చేసుకుంటున్నారు. ఇళ్ళకోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను ఎంపికచేసి నిధులను విడుదల చేయాలన్నది రేవంత్ ప్రభుత్వం ఆలోచన. ఇళ్ళ నిర్మాణాల్లో అర్హులకు తలా రు. 5 లక్షల సాయం అందించనున్నట్లు సిక్స్ గ్యారెంటీస్ లో కాంగ్రెస్ ఎన్నికల్లో హామీఇచ్చింది.
ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ మీదుంది. అందుకనే ఈ పథకంపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. రేవంత్ ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నది. 17 లోక్ సభ సీట్లలో అత్యధికంగా లబ్దిపొందటమే రేవంత్ ముందున్న ఏకైక టార్గెట్. అందుకనే ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను ఒక్కోటి అమల్లోకి తెస్తున్నారు.
This post was last modified on January 3, 2024 11:35 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…