Political News

ఏపీ కాంగ్రెస్ తో కలిసి నడుస్తా: షర్మిల

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతోందని, అందరి ఆశీర్వాదం కావాలని షర్మిల అన్నారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నానని షర్మిల వెల్లడించారు. ఢిల్లీలో రేపు జరగబోయే సమావేశం తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని, అందుకే పోటీ నుంచి విరమించుకున్నానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేవని అన్నారు. కేసీర్ సర్కారును గద్దె దించడంలో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.

ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటానికి తాము చేసిన సాయం కూడా ఒక కారణమని చెప్పుకొచ్చారు. అది గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తనను పార్టీలో చేరాలని ఆహ్వానించిందని అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకికవాద పార్టీ కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరికి భద్రతను ఇచ్చే పార్టీ అదేనని చెప్పారు. షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కాబోయే దంపతులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి కూడా షర్మిల వెంట ఉన్నారు. అయితే, షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా మీడియా ప్రతినిధులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించడం కనిపించింది. షర్మిల ముఖానికి దగ్గరగా మైకులు పెడుతుండడంతో ఆమె స్వయంగా వాటిని పలుమార్లు కిందకు దించుకోవాల్సి వచ్చింది. అయినా సరే, కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు మైక్ లను షర్మిల ముఖానికి దగ్గరగా తీసుకు వెళ్లడంతో వారిని షర్మిల భద్రతా సిబ్బంది సున్నితంగా వారించారు.

This post was last modified on January 3, 2024 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

1 hour ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

2 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

3 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago