Political News

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల?

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.

దీంతో, అదే రోజున షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఉంచేందుకు షర్మిల ఇడుపులపాయ వెళ్లారు. అక్కడ నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికపై అఫీషియల్ గా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ,  కాంగ్రెస్ పార్టీలో చేరికపై షర్మిల రేపు ఢిల్లీలో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు, ఈరోజు ఉదయం తన పార్టీ నేతలతో షర్మిల సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనం ఖాయమని, 4వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీ కాంగ్రెస్ లో షర్మిల అడుగు పెట్టబోతున్నారు అన్న ప్రచారం వైసీపీ నేతలలో కలవరం రేపుతోంది. వైసీపీలో టికెట్ దక్కని ఆశావహులంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టిపి విలీనంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, చివరి నిమిషంలో విలీనం ప్రక్రియను వాయిదా వేసుకున్న షర్మిల కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతునిచ్చారు. తన పార్టీ పోటీ చేస్తే 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయంపై ప్రభావం పడుతుందని, అందుకే కాంగ్రెస్ కు మద్దతిచ్చానని షర్మిల అన్నారు.

This post was last modified on January 2, 2024 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

55 minutes ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

3 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

4 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

5 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

5 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

6 hours ago