ఆయన మంత్రిగారికి వేలు విడిచిన వియ్యంకుడు. చాలా దూరపు బంధువే.. అయినా.. రాజకీయంగా చూస్తే మాత్రం చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. దీంతో సదరు నాయకుడు.. మంత్రిగారి ప్రొద్బలంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ట్రై కూడా చేసేస్తున్నారు. దీంతో కీలకమైన నియోజకవర్గంలో రాజకీయ కాక పెరిగిపోయింది. మరి ఆ విశేషాలు.. తెలుసుకుందామా!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చోడవరం. ఇక్కడ నుంచి వైఎస్‌కు అత్యంత విధేయుడు, సీఎం జగన్ అంటే.. ప్రాణం పెట్టేసే నాయకుడు కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే.. తన సీనియార్టీకి.. తన స్థాయికి మంత్రి పదవి దక్కలేదనే ఆవేదన ఈయనలోనూ ఉంది. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్నారు. కొన్నా ళ్ల కిందట బహిరంగంగా తన మనసులోమాట చెప్పేసి.. విమర్శలు గుప్పించారు.
దీనిని అనువుగా తీసుకున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు.. తనకు దూరపు బంధువు, వరుసకు వేలు విడిచిన వియ్యంకుడు అయ్యే.. వైసీపీ వైద్యుల విభాగం జిల్లా అధ్యక్షుడు డా. బండారు సత్యనారాయణ మూర్తిని ప్రోత్సహించడం ప్రారంభించారు. దీంతో బండారు.. వచ్చే ఎన్నికల్లో చోడవరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తెరవెనుక తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పైకి మాత్రం.. కరణం ధర్మశ్రీకి టికెట్ ఇవ్వకపోతే.. అది తనకే ఇవ్వాలని ప్రకటనలు చేస్తున్నారు.
ఇటీవల చోడవరంలో మీడియా మీటింగ్ పెట్టి మరీ.. డాక్టర్ బండారు.. ధర్మశ్రీని మార్చాలని అనుకుంటే తాను పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు.. ఇదేసమయంలో వైసీపీకి తాను చేసిన సేవలను ఏకరువు పెట్టారు. తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్‌గా ఉందని.. మంత్రి బూడి ముత్యాలనాయుడు చక్రం తిప్పుతున్నారని కరణం వర్గం ఆరోపిస్తోంది.
మంత్రి బూడి ప్రోద్బలంతోనే బండారు రంగంలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో మం త్రి గారి వియ్యంకుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారా? అనే చర్చ నియోజకవర్గంలో వినిపిస్తుం డడం గమనార్హం. మరి పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ధర్మశ్రీకి ప్రాధాన్యం ఉంటుం దా? మార్పు చేస్తారా? అనేది కూడా ఆసక్తిగా మారింది.
This post was last modified on January 2, 2024 3:15 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…