Political News

ఎస్టీ స్థానాల్లో లెక్క‌కు మించిపోయారుగా!

సాధార‌ణంగా ఎస్టీ అసెంబ్లీ స్థానాలను తీసుకుంటే.. అది ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు నాయ‌కుల సంఖ్య పెద్ద‌గా ఉండేది కాదు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే పోటీ ప‌డేవారు. వారిలోమెరుగైన వారిని పార్టీలు ఎంపిక చేసుకుని టికెట్లు ఇచ్చేవి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు కాబ‌ట్టి.. ఎస్టీల్లో నే పోటీ కూడా ఉండేది. కొన్ని క‌ట్టుబాట్లు.. కొన్ని ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మిగిలిన నాయ‌కులు స‌ర్దుకు పోయేవారు. అయితే.. మారుతున్న‌కాలంలో మారుతున్న‌కాలానికి అనుగుణంగా ఎస్టీల్లోనూ రాజ‌కీయ నాయ‌కులు పెరిగారు.

ఇది మంచి ప‌రిణామ‌మే. రాజ‌కీయంగా కూడా ఎస్టీలు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఈ ప‌రిణామం ఇప్పుడు అటు అధికార‌వైసీపీ, ఇటు టీడీపికి కూడా త‌ల‌కు మించిన భారంగా మారిపోయిం ది. ఎందుకంటే.. ఎస్టీ స్థానాల్లో ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా లెక్క‌కు మించిన స్థాయిలో నాయ‌కులు పోటీ కి రెడీఅంటూ కాలుదువ్వుతున్నారు. అంతేకాదు.. వీరిలోనూ.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఫిర్యాదు లు ప‌ర్వాలు కొన‌సాగుతున్నాయి. దీంతో ఎవ‌రిని కాదంటే ఏం జ‌రుగుతుందో అనే చ‌ర్చ పార్టీల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్టీ స్థానాల్లోనూ వైసీపీ విజ‌య‌ఢంకా మోగించింది. ఇక ఇప్పుడు కూడా.. అదే ప‌రంపర కొన‌సాగుతుంద‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. దీంతో ఒక్కొక్క సీటుకు లెక్కకు మించిన నాయ‌కులు త‌ల‌ప‌డేందుకు రెడీగా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు  అరకులో య ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను వ్యతిరేకిస్తున్న వారు ఆ నియోజకవర్గంలో పెరుగుతున్నారు. ఓ జడ్పీటీసీ సభ్యుడితో పాటు, విద్యాశాఖ అధికారి ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే ఫాల్గుణ‌ను మార్చాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్‌ చేసింది. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టిలో ఉంది. అంటే మొత్తంగా సిట్టింగుతో పాటు ముగ్గురు ఈ సీటు కోసం త‌ల‌ప‌డుతున్నారు. ఇక‌, టీడీపీలోనూ ఇంతే స్థాయిలో పోటీ ఉంది. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌వ‌ర్గం పాడేరు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఈసారీ తనకే అవకాశం ఇస్తారని విశ్వాసం తో ఉన్నారు.

అయితే.. ఈ స్థానం ద‌క్కించుకునేందుకు వైసీపీలో ఉన్న  మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, పసుపులేటి బాలరాజు తమ కుమార్తెలకు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎంపీ గొడ్డేెటి మాధవి ఈ సీటును ఆశిస్తు న్నారు. దీంతో ఎవ‌రిని అధిష్టానం క‌రుణిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌ర‌ల్ స్థాయి పోటీ పెరిగిపోవ‌డంతో పార్టీలు త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on January 2, 2024 1:07 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago