ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు.. వైసీపీ తమకు టికెట్లు ఇవ్వకపోవడంతో అనేక మంది నాయ కులు అలుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉంటామని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన వారు.. మళ్లీ తిరిగి దూరం కావాలంటే.. చాలా సమయం, ఓర్పు.. నేర్పు.. ఇలా అనేకం కావాలి. పైకి చెప్పినంత తేలికగా.. రాజకీయ సన్యాసం తీసుకోవడం కుదరదు. తమనే నమ్ముకు న్న కార్యకర్తలు కావొచ్చు. పారిశ్రామిక వేత్తలు కావొచ్చు.. పెట్టుబడులు పెట్టిన వారు కావొచ్చు. ఇలా.. అనేక అంశాలు ప్రభావితం అవుతాయి.
అయినప్పటికీ.. రాజకీయాలకు దూరమవుతామని.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోమని ప్రకటిస్తున్నారం టే.. వారికి పొలిటికల్‌గా అవకాశాలు రాలేదని అనుకోవాలా? లేక వచ్చినా వదులుకున్నారా ? అనేది చర్చ నీయాంశంగా మారింది. ఉదాహరణకు మైలవరం ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. వాస్తవానికి ఈయన తండ్రి నుంచి ఈయన (కొన్నాళ్ల వరకు)వరకు కూడా టీడీపీలోనే రాజకీయాలు చేశారు. దీంతో టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, టీడీపీ నుంచి ఆహ్వానం అందినట్టుగా లేదని అంటున్నా రు.
వ్యక్తిగత కారణాలు.. రాజకీయ వ్యూహాలతో టీడీపీనే ఆయనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈయన కూడా వైసీపీకి రాజీనామా చేశారు. కానీ, ఏ ఒక్క పార్టీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. టీడీపీ కాకపోయినా.. కనీసం కాంగ్రెస్ కూడా ఆయనను పిలిచిన పాపాన పోలేదు. మరోవైపు.. ఆయా పార్టీల్లోనూ వైసీపీ నాయకులను చేర్చుకుందామన్న ఇంట్రస్ట్ కనిపించడం లేదని అంటున్నారు.
వెరసి.. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన సీన్ చూస్తే.. వైసీపీ నుంచి వచ్చిన వారికి ఏదో ఒక పార్టీ అండగా నిలవాల్సిన సమయంలోనూ .. నిలవలేదంటే.. ఆయా నాయకుల పరిస్థితి ఏకాకిగా మారిపోవడమేననే టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగతంగా వారు చేసుకున్న రాజకీయాలే దీనికి కారణమని అంటున్నారు. ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ప్రత్యర్థిపార్టీలను ప్రత్యర్థులుగానే చూడాలి తప్ప.. వ్యక్తిగత వైషమ్యాలు రగిలిపోయేలా వ్యవహరిస్తే.. చివరకు నష్టం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రస్తుత పరిణామాలే ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 1, 2024 6:32 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…