Political News

రాహుల్ గాంధీ తో షర్మిల భేటీ

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ముహూర్తం రెడీ అయ్యిందా ? అవుననే సమాచారం వస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి. ఈనెల 3 లేదా 7వ తేదీన పార్టీలోకి షర్మిల ఎంట్రీ ఉండచ్చని అంచనా అనుకుంటున్నారు. ఎంట్రీతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకునేందుకు షర్మిల మంగళవారం ఢిల్లీకి వెళ్ళి రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయట.

పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే అధిష్టానం షర్మిల ముందు రెండు ఆప్షన్లుంచిందట. అదేమిటంటే ఏపీ పార్టీ పగ్గాలు అందుకున్నాక  కర్నాటక లేదా తెలంగాణా నుండి రాజ్యసభకు నామినేట్ అవ్వటం. రెండో ఆప్షన్ ఏమిటంటే పార్టీపగ్గాలు అందుకున్నాక రాబోయే ఎన్నికల్లో కడప లోక్ సభకు పోటీచేయటం. ఈ రెండు ఆప్షన్లలో  షర్మిల దేనివైపు మొగ్గుచూపుతుందన్న విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. ఆప్షన్ ఏదైనా మెయిన్ టార్గెట్ సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అన్న విషయం అర్ధమవుతోంది.

జగన్ను టార్గెట్ చేయటం ఇష్టంలేకే షర్మిల తెలంగాణాలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణాలో ఉనికి కూడా చాటుకోలేకపోయిన నేపధ్యంలో వేరేదారిలేక తిరిగి ఏపీలోకి రావాల్సొస్తోంది. కాంగ్రెస్ లో చేరకపోతే ఏమి చేసుండేవారో కానీ ఇపుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోక తప్పటంలేదు. కాబట్టి జగన్ను టార్గెట్ చేయకా తప్పదు. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ కుటుంబంలోని విభేదాలన్నీ రోడ్డున పడటం ఖాయమని అర్ధమవుతోంది. ఇదే సందర్భంగా పార్టీని బలోపేతం చేయటంలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలమేయటం కూడా  ఎజెండాలో బాగమే.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో టికెట్లు దక్కని సీనియర్లకు గాలమేసి అలాంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యత కూడా షర్మిల మీదే ఉంటుంది. ఆ రకంగా కాంగ్రెస్ కు సడెన్ బూస్టప్ వచ్చినట్లవుతుంది. తక్కువలో తక్కువ ఓ 20 మంది ఎంఎల్ఏలు, మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగితే ఎంతో కొంత ప్రభావం ఉండటం ఖాయం. ఆ రకంగా కాంగ్రెస్ బలోపేతమవ్వాలని ఆలోచిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. 

This post was last modified on January 1, 2024 5:35 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

1 hour ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

7 hours ago