ఇతర పార్టీలకు టీడీపీకి చాలా తేడా కనిపిస్తోంది. ఇతర పార్టీల్లో బంధువర్గ కుటుంబాలు చాలా వరకు తక్కువ. కానీ, టీడీపీ విషయానికి వస్తే.. ప్రతి జిల్లాలోనూ బంధు వర్గ కుటుంబాలు కనిపిస్తాయి. దీంతో పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక్కటే టికెట్ అనే లైను పెట్టుకున్నా వీరి విషయంలో మాత్రం.. దీనిని దాటవేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఆకుటుంబాలు అంత బలంగా పార్టీలో వ్యవహరిస్తు న్నాయి.
ఫలితంగా ఈ బంధువర్గ కుటుంబాలకు రెండేసి చొప్పున టికెట్లు కేటాయింపు అనివార్యంగా మారింది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు వియ్యంకులు టీడీపీకి రెండు కళ్ల వంటి వారు. వీరిద్దరికీ టికెట్‌లు ఇవ్వక తప్పదు. వారే వినుకొండ నుంచి జీవీ ఆంజనేయులు, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్. ఇక, తూర్పు గోదావరి విషయానికి వస్తే.. కింజరాపు ఎర్రన్నాయుడు వియ్యంకులు ఇద్దరూ పార్టీలోనే ఉన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి, ఆదిరెడ్డి వాసు వీరిద్దరికీ టికెట్లు ఇవ్వాల్సిందే.
అదేవిధంగా కింజరాపు బాబాయి-అబ్బాయి.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుకు కూడా టికెట్ తప్పదు. అదేసమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలు వియ్యంకులు.. వీరిద్దరూ చంద్రబాబుకు అత్యంత కావాల్సిన వారు. పైగా కాపు సామాజిక వర్గం దీంతో ఇద్దరికీ టికెట్ లు ఇవ్వక తప్పదు. ఇక, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఈ దఫా టికెట్ ఇస్తున్నారు. వీరి సొంత నియోజకవర్గం తుని టికెట్‌ను కేటాయించారు.
ఇదేసమయంలో యనమల వియ్యంకుడు, కడప జిల్లాకు చెందిన మైదుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కూడా టికెట్ ఇవ్వక తప్పదు. అదేవిధంగా నందమూరి కుటుంబానికి కూడా రెండు టికెట్ కేటాయించాల్సిందే. నందమూరి బాలయ్యకు హిందూపురం అసెంబ్లీ, ఆయన చిన్నల్లుడు శ్రీభరత్‌కు.. విశాఖ పార్లమెంటు సీటు ఇవ్వాల్సిందే. ఇక, నారా కుటుంబానికి ఇప్పటికే రెండు సీట్లు ఖరారయ్యాయి. చంద్రాబాబు కుప్పం నుంచి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. ఇక్కడ వీరు గెలుస్తారా? లేదా? అనే విషయంతో సంబంధం లేదు.. టికెట్ మాత్రం ఇవ్వక తప్పదు.. అది అంతే!!
This post was last modified on January 1, 2024 4:09 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…