Political News

వైఎస్ వార‌స‌త్వానికి కాల ప‌రీక్ష‌

ఇదొక అనూహ్య రాజ‌కీయం. దివంగ‌త ప్ర‌జానేత‌, రైతు బాంధ‌వుడిగా పేరొందిన వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి వార‌స‌త్వానికి క‌ఠిన ప‌రీక్ష‌.. కాల‌ప‌రీక్ష రెండూ ఎదురు కానున్నాయి. అది కూడా వైఎస్ జ‌న్మ‌రాష్ట్రం ఏపీలోనే కావ‌డం గ‌మ‌నార్హం. నిన్న మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు .. వైఎస్ వార‌స‌త్వం అంటే.. కేవ‌లం ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ మాత్ర‌మేఅనుకునే ప‌రిస్థితి ఉండేది. ఇదే.. 2014, 2019లో జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చిన రాజ‌కీయ వ్యూహం. అయితే.. కాలం మారిపోయింది.

గ‌డిచిన ఐదేళ్ల‌లో అనేక అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్న కోసం రోడ్డెక్కిన వైఎస్‌త‌న‌య‌, సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ఇప్పుడు వేరు కుంప‌టి పెట్టుకుని.. ఇదే వైఎస్ వార‌సురాలిన‌ని ప్ర‌క‌టించుకున్న విష‌యంతెలిసిందే. అయితే.. అది పొరుగు రాష్ట్రం తెలంగాణ‌కే ప‌రిమితం అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇక్క‌డా అనూహ్య రాజ‌కీయ‌మే తెర‌మీదికి వ‌చ్చింది. త‌మ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందంటూ.. ష‌ర్మిల కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించారు. అయితే.. అక్క‌డ ఆమె ప్ర‌భావాన్ని తెర‌చాటున వినియోగించుకున్న కాంగ్రెస్‌..ఇప్పుడు మాత్రం ఏపీలో బ‌హిరంగంగా ష‌ర్మిల ఆయుధానికి వైఎస్ వార‌స‌త్వం ప‌దును ప్ర‌యోగించేందుకు రెడీ అయింది. ఇదే క‌నుక జ‌రిగి.. ష‌ర్మిల‌ను ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టిస్తే.. ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. ఇక‌, ఏపీ రాజ‌కీయం మ‌రింత సెగ‌లు క‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అంతేకాదు..ఈ ప‌రిణామం ఏకంగా వైఎస్ వార‌స‌త్వం అనే వ్య‌వ‌హారాన్ని కూడా కీల‌క మ‌లుపు తిప్పేస్తుం ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సుడిగా ఉన్న సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న సోద‌రి ష‌ర్మిలే.. పోటీకి రానున్నారు. తాను కూడా వైఎస్ బిడ్డ‌నేన‌ని.. తాను కూడా రాజ‌కీయ వార‌సురాలినేని ఆమె ఏపీలోనూ ప్ర‌చారం చేసుకునేందుకు లైన్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది.

ఇది.. వైఎస్ వార‌స‌త్వానికి క‌ఠిన ప‌రీక్ష‌నే పెట్ట‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతిమంగా నిర్ణ యించేంది ప్ర‌జ‌లే క‌నుక‌.. వైఎస్ వార‌సత్వం విష‌యంలో ప్ర‌జ‌లే ఈ ప‌రీక్ష‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప్ర‌జ‌లు ఎలాంటితీర్పు ఇస్తారో చూడాలి.

This post was last modified on January 1, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో కూన క‌ల్లోలం.. స్పీక‌ర్ ఫైర్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…

1 hour ago

ఎన్నిసార్లు దొరికిపోతావు త‌మ‌న్?

టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…

2 hours ago

భయపడినట్టే దెబ్బ కొట్టిన అమరన్

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…

4 hours ago

ఆ సుకుమార్.. ఈ సుకుమార్.. ఒక్కరేనా?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…

5 hours ago

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

6 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

6 hours ago