తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లున్నారు. ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు పార్టీలోని ముఖ్యనేతలతో భేటీలు జరిపేందుకు షెడ్యూల్ రెడీచేసినట్లు తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. జనవరి 3వ తేదీన మొదలవ్వబోయే సమావేశాల షెడ్యూల్ 21వ తేదీతో ముగుస్తోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలోని నేతలకు కేసీయార్ ఒక్కో తేదీని కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్ననే జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
తెలంగాణా వేదికగా జరగబోతున్న భేటీలు ప్రతినెలలో ఒకసారి జరపాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. అంటే పార్లమెంటు ఎన్నికలు జరిగేలోపు కనీసం మూడుసార్లు అందరితోను సమావేశం అవ్వాలని కేసీయార్ టార్గెట్ గా పెట్టుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయించాల్సిన అభ్యర్ధులపై సర్వేలు చేయించుకుంటున్నారు. భేటీలు మొదలయ్యే సమయానికి అభ్యర్ధులపై కేసీయార్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
ఆదిలాబాద్ నియోజకవర్గంతో మొదలయ్యే సమావేశాలు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గం సమావేశంతో ముగుస్తుందని షెడ్యూల్ ను బట్టి అర్ధమవుతోంది. 12 నుండి 15వ తేదీవరకు సంక్రాంతి పండుగ సందర్భంగా సమావేశాలకు విరామం ఇవ్వబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలు చాలా కొద్దిపాటి తేడాతోనే చేజారిన విషయాన్ని కేసీయార్ ప్రస్తావించబోతున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో మళ్ళీ మెజారిటి సాధించాలంటే అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ పై నేతలతో చర్చించబోతున్నారు.
ముందు పార్టీ పరంగా సమీక్షలు పూర్తి చేసి, అభ్యర్ధుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టుగా జనాల్లోకి వెళ్ళేట్లుగా కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు. తుంటి ఎముక విరగటంతో కేసీయార్ ఇపుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. బహిరంగసభలు నిర్వహించాలని అనుకుంటున్న సమయానికి డాక్టర్లు చెప్పినట్లుగా ఆరువారాల విశ్రాంతి కూడా అయిపోతుంది. పిబ్రవరిలో నోటిపికేషన్ రావచ్చని అనుకుంటున్నారు. కాబట్టి అప్పటికి ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలన్నది కేసీయార్ ఆలోచన. ఏదేమైనా మెజారిటి సీట్లు సాధించకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమవుతుందో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే దానికి తగ్గట్లుగా యాక్షన్ ప్లాన్ రెడీచేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on December 31, 2023 9:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…