సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్‌ను జల్లెడ పడుతోంది. ఏకంగా ఎనిమిది మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే… కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యను విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తమ ఆఫీసుకు(విజయవాడ) రావాలని, కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు ఒత్తిడి చేసినట్టు సమాచారం. అయితే, తన ఇంట్లో పాప కేర్ టేకర్ మాత్రమే ఉన్నారని తాను రాలేనని ఆమె చెప్పారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు వినలేదని కొలికపూడి భార్య ఆందోళన వ్యక్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్‌రావు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు.. అపార్ట్‌మెంట్ ఫ్లోర్‌లోకి వచ్చిన సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్‌రావు కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా ఆయనను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేశారు. ఇదిలావుంటే, రాం గోపాల్ వర్మ ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని స్వయంగా కలుసుకుని కొలికపూడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తన తల తెచ్చిన వారికి రూ.కోటి సుపారీ ఇస్తానని కొలికపూడి ఓ టీవీ ఛానెల్‌లోనూ వ్యాఖ్యానించారని.. వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపషథ్యంలోనే సీఐడీ పోలీసులు అరెస్టుకు ఉపక్రమించారు. ఇదిలావుంటే.. మరోవైపు కొలికపూడి తన న్యాయవాదుల ద్వారా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 30, 2023 7:39 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…