వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న సంకల్పంతో “సీబీఎన్ ఫోరం“ రంగంలోకి దిగింది. ఫోరం ప్రతినిధులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. రాష్ట్రంలో సమస్యలపై అంశాల వారీగా వివరిస్తూ ప్రజలకు సీబీఎన్ ఫోరం అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్నాజిల్లాలోని నందిగామలో `దళిత గళం` పేరుతో వైసీపీ ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది.
సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ‘‘సీబీయన్ ఫోరం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. 2020 విజన్ ద్వారా చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ఐటీ విప్లవం తీసుకు వచ్చారు. ఆయన ముందు చూపు కారణంగానే లక్షలాది మంది తెలుగువాళ్లు ఐటీ రంగంలో రాణిస్తున్నారు. అటువంటి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారు. వాస్తవాలను వివరించాలనే మేమంతా కలిసి సీబీయన్ పోరం ప్రారంభించాం. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, యువతకు జరిగిన మేలు గురించి వివరిస్తున్నాం. చంద్రబాబు మార్కు అభివృద్ధిని, విజన్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాం“ అని సుమిత వివరించారు.
సీబీయన్ ఫోరంలో అన్ని వర్గాల వారు ప్రతినిధులుగా ఉన్నారని పోరం ప్రధాన కార్యదర్శి అమర్ తెలిపారు. కొంతమంది ఒక సామాజికవర్గం పేరు చెప్పి వారి తప్పులు బయటపడకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఏపీకి ఎంత మేలు జరిగిందో వివరిస్తున్నామన్నారు. భాబు విజన్‌ను అర్థం చేసుకుంటే.. భవిష్యత్ తరాలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. “2020 చంద్రబాబు విజన్ వల్లే మేమంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. 2047 విజన్ ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు, యువత మమ్మల్ని చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి“ అని అమర్ పిలుపునిచ్చారు.
This post was last modified on December 30, 2023 7:36 pm
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…