Political News

చంద్ర‌బాబుకు భ‌లే ఛాన్స్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు భ‌లే ఛాన్స్ చిక్కింద‌ని అంటున్నారు రాజకీయ విశ్లేష‌కులు. వ‌చ్చే ఎన్నిక ల్లో  ఎక్క‌డ ఎలాంటి అభ్య‌ర్థిని నిలబెట్టాలి?  అధికార పార్టీతో ఉన్న పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే నాయ కులను ఎవ‌రిని ఎంపిక చేయాలి? అనే విష‌యాలు.. ఆయ‌న‌కు ఇక‌, చాలా వ‌ర‌కు తేలిక అవుతుంద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. నువ్వు ముందా?  నేను ముందా? అన్న‌ట్టుగా ఉన్న అభ్య‌ర్థుల ఎంపిక‌లో వైసీపీ ముందేన‌ని తేలిపోయింది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఒక క్లారిటీ వ‌చ్చేస్తోంది.

మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మార్పులు, చేర్పుల దిశ‌గా వైసీపీ దూకుడుగా ఉంది. ఎలాంటి శ‌ష‌భిష ల‌కు తావులేకుండా అభ్య‌ర్తుల‌ను ఎంపిక చేస్తోంది. ఈ క్ర‌మంలో ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నా రు?  వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచేవారి స‌త్తా ఎంత‌?  ఆర్థిక ప‌రిస్థితి ఏంటి?  కుల‌, మ‌త సామాజిక వ‌ర్గీక‌ర ణ‌లు ఎలా ఉండ‌నున్నాయి?  వంటి కీల‌క విష‌యాల‌పై మ‌రో 10 నుంచి 15 రోజుల్లో వైసీపీ త‌ర‌ఫున క్లారిటీ రానుంది.

దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీగా ఉన్న టీడీపీకి  అభ్య‌ర్థుల ఎంపిక చాలా వ‌ర‌కు తేలిక అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో అభ్య‌ర్థుల బహిరంగ క‌స‌ర‌త్తు  ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా వైసీపీనే. ఆ పార్టీ ఎలాంటి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపుతుంది?  ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు వెళ్తుంది? అనే చ‌ర్చ టీడీపీలో త‌ర‌చుగా ఉంది. వైసీపీ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహం వేద్దామ‌నే ఆలోచ‌న కూడా పార్టీలో తెర‌మీదికి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్థుల‌ను దాదాపుగా ఖ‌రారు చేస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు త‌న పార్టీ లేదా మిత్ర‌ప‌క్షాల త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం సునాయాసం అవుతుంద‌ని.. అంటున్నారు పరిశీల‌కులు. బ‌ల‌మైన అభ్య‌ర్థుల ఎంపిక‌, ఎంత పోటీనైనా త‌ట్టుకునే సామ‌ర్థ్యం ఉన్న‌వారిని.. వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగ‌నున్న నేత‌ల సామ‌ర్థ్యాల‌ను అంచ‌నా వేయ‌డం వంటివి తేలిక పడుతుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ చేస్తున్న‌క‌స‌ర‌త్తు.. చంద్ర‌బాబుమంచి చాన్స్ గా మారుతుంద‌ని అంటున్నారు.

This post was last modified on December 30, 2023 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…

6 hours ago

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని…

8 hours ago

అభిమానులను తిడితే సినిమా హిట్టవుతుందా

హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…

8 hours ago

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…

9 hours ago

టీడీపీలో కుములుతున్న ‘కొన‌క‌ళ్ల’.. ఏం జ‌రిగింది ..!

మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు.. త‌న యాక్టివిటీని త‌గ్గించారు. ఆయ‌న పార్టీలో ఒక‌ప్పుడు యాక్టివ్…

9 hours ago

ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…

10 hours ago