తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ మండలాల్లో ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పర్యటిస్తూ.. సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా శాంతిపురం మండలంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు గుప్పించారు
“ల్యాండ్ టైటిల్” చట్టం తెచ్చింది భూములు దోచేందుకేనని, ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ మాత్రం కొండంత అని చంద్రబాబు దుయ్యబట్టారు. “శాంతిపురం నాకు కొత్త కాదు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. కానీ మీలో ఈసారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. నిన్న, నేడు మీ ఉత్సాహం చూశాక మన కుప్పంలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి. ఒకటి కుప్పం..రెండోది హిందూపురం.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మీ పెద్ద కొడుకును!
కుప్పం నియోజక వర్గానికి తాను పెద్దకొడుకునని చంద్రబాబు అన్నారు. “నేను ఇక్కడ కులం, మతం, చూడకుండా మీ పెద్దకొడుకుగా ఉండాలని పని చేశాను. ఈ నియోజకవర్గంలో ఎవరికీ దక్కని అభిమానం నాకు దక్కింది. నేను నామినేషన్ వేయడానికి కూడా రావద్దని చెప్పి గెలిపించిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేము గెలిపించుకుంటాం. మీరు మళ్లీ సీఎంగా రావాలని కోరుతున్నారు. తెలుగుజాతికి కుప్పం ఒక ప్రయోగశాల” అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగామారి, ప్రజలను దోచుకున్నారంటే దానికి కారణం జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. “వైసీపీ వాళ్లను నేను సీఎం అయ్యాక వదిలిపెడతానా.? ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు.. సైకో కాదా? ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా..ఏంటీ ఈ నియంత పోకడలు.? 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను..ఎంతో మంది సీఎంలను చూశానుకానీ..ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు” అని చంద్రబాబు ఫైరయ్యారు.
This post was last modified on December 29, 2023 10:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…