Political News

‘మాట‌ల రాయుడు’.. చేర‌గానే ప‌ని మొద‌లు పెట్టేశాడే!

భార‌త క్రికెట‌ర్‌.. గుంటూరుకు చెందిన అంబ‌టి రాయుడు.. కేవ‌లం బ్యాటింగ్ రాయుడే కాదు.. మాట‌ల రాయుడు అని కూడా నిరూపించేసుకున్నాడు. వైసీపీలో ఇలా చేరాడో లేదో అలా.. నోటికి, మాట‌ల‌కు ప‌ని చెప్పేశారు. తాజాగా గురువారం సాయంత్రం వైసీపీ కండువా క‌ప్పుకొన్న రాయుడు.. ఆ పార్టీలోకి అధికారి కంగా చేరిన విష‌యం తెలిసిందే. స‌హ‌జంగా అయితే.. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌, లేదా.. క‌నీసంలో క‌నీసం ఓ ప‌దేళ్ల హిస్ట‌రీ ఉన్న నాయ‌కులైతే.. ఇలా పార్టీ మార‌గానే అలా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేసేస్తారు.

కానీ, రాయుడుకు ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాటింగ్‌, బౌలింగ్ అనుభ‌వ‌మే త‌ప్ప‌.. రాజకీయ అనుభ‌వం లేదు. అయినా.. కూడా నేనేం తక్కువ అనుకున్నాడో.. వైసీపీలో ఇలా ఉండ‌క‌పోతే.. ఎలా అనుకున్నాడో తెలియ‌దు కానీ.. వెంట‌నే నోటికి ప‌నిచెప్పారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై విరుచుకుప‌డ్డాడు. అది కూడా.. ఎన్నిక‌ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే విమ‌ర్శ‌లు గుప్పించాడు. దీంతో అంబ‌టి రాయుడు కాదు.. మాట‌ల రాయుడు అనే టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ రాయుడు ఏమ‌న్నాడంటే.. “ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను పేద‌ల‌కు అందిస్తోంది అయితే.. ఇలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రం ఏమైపోతుంది? అప్పులు చేసి మ‌రీ పంచేస్తే.. ఎలా? అంటూ టీడీపీ జ‌న‌సేన విమ‌ర్శ‌లు గుప్పించాయి. మ‌రి ఆ పార్టీలు కూడా ఇప్పు డు ఎన్నిక‌ల వేళ ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి క‌దా? మ‌రి అప్పుడు ఏమ‌నాలి? ” అని రాయుడు ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. అధికార ప‌క్షం ఏం చేస్తోందో.. ప్ర‌తిప‌క్షాలు ఏం చేస్తున్నాయో.. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నా ర‌ని .. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి ఆన్స‌ర్ ఇవ్వాలో వారికి బాగా తెలుసున‌ని రాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన తాను.. ఆ ప్రాంత సంక్షేమం కోసం.. ప‌నిచేస్తాన‌ని వెల్ల‌డించారు. కాగా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాయుడిని అసెంబ్లీ బ‌రిలో నిల‌బెట్టే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలుచెబుతున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు.

This post was last modified on December 29, 2023 11:44 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago