Political News

బయటపడిన ల్యాండ్ క్రూయిజర్లు

తాజాగా రేవంత్ రెడ్డి బయటపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ల ఆచూకి బయటపడింది. రేవంత్ చిట్ చాట్ గా మాట్లాడుతు కేసీయార్ 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టినట్లు చెప్పారు. రేవంత్ బయటపెట్టిన విషయం సంచలనంగా మారింది.  కేసీయార్ ప్రభుత్వం ల్యాండ్ క్రూయిజర్లు కొనటం ఏమిటి ? వాటిని విజయవాడలో దాచిపెట్టడం ఏమిటనే విషయంపై జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. దాంతో క్రూయిజర్ల కార్ల ఆచూకీ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాలు మొదలుపెట్టారు.

విజయవాడకు వెళ్ళిన ఇంటెలిజెన్స్ అధికారులకు ల్యాండ్ క్రూయిజర్లు కనబడ్డాయి. విజయవాడ వీరపనేని ఇండస్ట్రియల్ పార్క్ లోని త్రినయిని ఇంజనీరింగ్ వర్క్స్ లో 22 కార్లున్నట్లు కనుక్కున్నారు. ఈ 22 కార్లను బుల్లెట్ ప్రూఫ్ చేయించటంతో పాటు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సాంకేతికతను ఏర్పాటుచేయటం కోసమే విజయవాడలో ఉంచినట్లు తెలుసుకున్నారు. అయితే ఈ కార్లకు ఇంకా బుల్లెట్ ప్రూఫింగ్ జరగలేదని సమాచారం. కాబట్టి బుల్లెట్ ప్రూఫింగ్ జరగాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ప్రభుత్వం రు. 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలుచేసింది. ఎందుకంటే మూడోసారి ముచ్చటగా తానే అధికారంలోకి వస్తానన్న నమ్మకంతోనే. నిజానికి ఇంత ఖరీదైన కార్లను కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే కేసీయార్ కు రెండు కాన్వాయ్ లు ఉన్నాయి. అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లే. ఒకవైపు అప్పుల మీద అప్పులు చేస్తు, మరోవైపు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బిల్లులను నిలిపేసి, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవని చెప్పిన కేసీయార్ 66 కోట్ల రూపాయలతో ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనుగోలు చేయటం అవసరమా ? అనే చర్చ ఇపుడు జనాల్లో మొదలైంది.

జనాల సొమ్ముతో కేసీయార్ చేసుకున్న షోకులపై జనాలు ఇపుడు మండిపోతున్నారు. బ్రహ్మాండంగా ఉన్న సెక్రటేరియట్ భవనాలను అవసరం లేకపోయినా కూలగొట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చులు చేసి కొత్త భవనం కట్టించటంపైన కూడా జనాల్లో బాగా వ్యతిరేకతుంది. పైగా కొత్తగా కట్టిన భవనం బాగా నిసిరకంగా తేలింది. మరి ఈ కొత్తకార్లను రేవంత్ ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.  

This post was last modified on December 29, 2023 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

3 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

4 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

4 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

4 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

6 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

6 hours ago